హిట్టా లేక ఫట్టా : హ‌లో గురు ప్రేమ‌కోస‌మే.. ప‌క్కా ఎంట‌ర్‌టైన‌ర్

Thursday, October 18th, 2018, 05:14:43 PM IST

టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజుకు ఈ ఏడాది పెద్ద‌గా క‌లిసిరాలేదు. గ‌త ఏడాది నిర్మాత‌గా వ‌రుస‌గా ఆ హిట్టు ఇచ్చిన దిల్ రాజుకి ఎంసీఏ చిత్రంతో బ్రేక్ ప‌డింది. అలాగే ఈ ఏడాది ఈ నిర్మాత నుండి వ‌చ్చిన ల‌వ‌ర్, శ్రీనివాస క‌ళ్యాణం చిత్రాలు ప్లాప్ అవ‌డంతో ఎలాగైనా హిట్ కొట్టాల‌ని భావిస్తున్నారు. ఇక మ‌రోవైపు రామ్ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. నేను శైల‌జ‌తో కూల్ హిట్ కొట్టిన రామ్ త‌ర్వాత త‌ర్వాత న‌టించి హైప‌ర్, ఉన్న‌ది జింద‌గీ ఒక్క‌టే ప్లాప్ అవ‌డంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల‌నే క‌సితో ఉన్నాడు. ఇక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కొత్త‌లో మంచి చిత్రాల్లో న‌టించి దూసుకుపోతున్న అనుప‌మకి స‌డెన్‌గా బ్రేక్ ప‌డి వ‌రుస ప్లాప్‌లు ఎదుర‌య్యాయి.

దీంతీ ఈ ముద్దుగుమ్మ కెరీర్ డేంజ‌ర్‌లో ప‌డింది. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఈ ముగ్గురు ప‌రిస్థితీ ఒక్క‌టే.. ఈ నేప‌ధ్యంలో ఈ ముగ్గురు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తాజా చిత్రం హ‌లో గురు ప్రేమ‌కోస‌మే. గ‌త ఏడాది దిల్‌రాజు నిర్మించిన నేను లోక‌ల్ చిత్రాన్ని.. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మ‌లిచి.. మంచి హిట్టు కొట్టి ఊపుమీద ఉన్నాడు డైరెక్ట‌ర్ న‌క్కిన త్రినాథ‌రావు. దీంతో ఈ ముగ్గురు ప్ర‌స్తుతం ఈ డైరెక్ట‌ర్ మీద‌నే ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు ఈ ముగ్గురినీ ఒడ్డున ప‌డేశాడా.. లేక ముంచాడా.. విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ హలో గురు ప్రేమ‌కోస‌మే చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద హిట్టా – ఫ‌ట్టా అనేది తెలుసుకుందాం.

ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు గ‌త చిత్రాలు చూస్తే క‌థ పెద్ద‌గా లేక‌పోయినా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు కొదువ ఉండ‌దు. దాదాపుగా త‌న సినిమాల్లో ఎక్కువ భాగం కామెడీ టేకింగ్‌తోనే స‌గం సినిమాని లాగించేస్తాడు. ఇక ఇంకో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే ఈ డైరెక్ట‌ర్ తీసిన చిత్రాల్లో ఒక కామ‌న్ పాయింట్ ఉంది.. అదేంటంటే మామా అళ్ళుళ్ళ మ‌ధ్య టీజింగ్. సినిమా చూపిస్త‌మావ‌లో రాజ్‌త‌రుణ్-రావుర‌మేష్ మ‌ధ్య గొడ‌వను బాగా ఎంట‌ర్‌టైన్‌గా మ‌లిచాడు. అలాగే నేను లోకల్‌లో అయితే నాని- స‌చిన్‌ల మధ్య వ‌చ్చే టీజింగ్ సీన్స్ ఓ రేంజ్‌లో న‌వ్విస్తాయి. అయితే తాజాగా వ‌చ్చిన హ‌లో గురు ప్రేమ‌కోస‌మే చిత్రంలో కూడా మామ‌-అళ్ళుడు పాయింట్‌ను తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు.

ఇక ఈ సినిమా క‌థ గురించి చెప్పాలంటే.. చాలా రొటీన్ స్టోరీ అల్ల‌రి చిల్ల‌ర‌గా తిరిగే కుర్రాడు ఉద్యోగం కోసం హైద‌రాబాద్ వెలితే.. అనుకోకుండా అక్క‌డ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు.. చివ‌రికి ఆ అమ్మాయి ప్రేమ‌ను పొంది ఆమెను ద‌క్కించుకున్నాడా లేదా అనేదే క‌థ‌. ఈ విష‌యం సినిమా స్టార్ట్ అయిన కొద్ది సేప‌టికే ప్రేక్ష‌కుల‌కు తెలిసిపోతుంది.. మ‌రి సినిమా చూడ‌డం ఎందుకంటారా.. చాలా రోటీన్ క‌థ‌నే ఎంచుకున్న డైరెక్ట‌ర్ దాన్ని తెర పైకి వ‌చ్చేస‌రికి దాన్ని పూర్తిగా మార్చేశాడు. తొలిభాగం ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియ‌దు అంత‌లా న‌వ్వులు ఉంటాయి ఈచిత్రంలో.. రామ్ – ప్ర‌ణ‌తి తండ్రికి మ‌ధ్య వ‌చ్చే డేటాబేస్, ఊప్స్ సీన్లకైతే థియేట‌ర్‌లో ప్రేక్ష‌కులు ప‌డిప‌డి న‌వ్వుతారు. ఇక ప్ర‌కాష్‌రాజ్-రామ్‌ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు కూడా ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్విస్తాయి. సినిమా మొత్తం కామెడీతో నింపేసి అక్క‌డ‌క్క‌డా సెంటిమెంట్‌ను పెట్టి స‌క్సెస్ అయ్యాడు ద‌ర్శ‌కుడు. ఇక ఫ‌స్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అయినా ఓవ‌రాల్‌గా ఈ చిత్రం మాత్రం టిక్కెట్ కొని థియేట‌ర్‌లోకి వెళ్ళిన‌ ప్రేక్ష‌కుడ్ని నిరాశ‌ప‌ర్చ‌దు.

ఇక సంజు పాత్రలో రామ్ చాలా కంఫ‌ర్ట్‌గా త‌న‌దైన ఎనర్టీతో న‌టించేశాడు. త‌న‌కు బాగా అచ్చిన కామెడీ, రొమాంటిక్ సీన్ల‌లో అయితే రామ్ రెచ్చిపోయాడ‌నే చెప్పాలి. కొన్ని సీన్ల‌లో కామెడీ టైమింగ్ చూసి అద‌ర‌హో అనాల్సిందే. ఎందుకంటే అంత‌లా న‌వ్వించాడు రామ్. ఇక ఈచిత్రంలో మ‌రో ముఖ్య‌మైన పాత్రం ప్ర‌కాష్ రాజ్‌ది. ఒక‌వైపు కూతురుకి తండ్రిలా.. మ‌రోవైపు త‌న కూతుర్ని ప్రేమించిన కుర్రాడికి ఫ్రెండ్‌లా త‌న‌దైన శైలిలో న‌టించారు ప్ర‌కాష్ రాజ్. ఈ చిత్రంలో ఆయన పాట పాడడమే కాక డ్యాన్స్ కూడా చేసి ప్రేక్షకుల్ని అలరించడం విశేషం.ఇక ఈ చిత్రంలో మెయిన్‌ హీరోయిన్ అనుప‌మ చాలా అందంగా క‌నిపించింది. త్రండి మాట దాట‌ని మిడిల్ క్లాస్ అమ్మాయిలాగా, క్యూట్ లుక్స్‌తో ఆక‌ట్టుకుంది. సొంతగా డ‌బ్బింగ్ చెప్పుకున్న అనుమ‌న త‌న పాత్ర‌కు న్యాయం చేసింది. ఇక మ‌రోహీరోయిన్ ప్ర‌ణిత ఉన్నంత సేపు బాగానే చేసింది. ఇక ఈ చిత్రంలో న‌టించిన ఆమ‌ని, జ‌య‌ప్రకాష్, సితార, పోసాని కృష్ణ‌ముర‌ళీ త‌మ త‌మ‌ పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేశారు.

ఇక ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవి శ్రీ ప్ర‌సాద్ నిరాశ‌ప‌ర్చాడ‌నే చెప్పాలి. పాటలు ఆక‌ట్టుకోక పోగా బ్యాగ్రౌండ్ స్కోర్ పై కూడా శ్ర‌ద్ధ తీసుకోలేదు. ఇక ఈ చిత్ర ర‌చ‌యిత బెజ‌వాడ ప్ర‌స‌న్న కుమార్ త‌న డైలాగ్స్‌తో థియేట‌ర్‌లో ప్రేక్ష‌కుల‌తో విజిల్స్ వేయించాడు. విజ‌య్ కే చ‌క్ర‌వ‌ర్తి సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ ప‌ర్వాలేదు. దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ బాగున్నాయి. ఇక ఈ చిత్రంలో రామ్ ఎన‌ర్జిటిక్ యాక్టింగ్, అనుపమ ట్రెడిష‌న‌ల్ గ్లామర్, ప్రకాష్ రాజ్ టైమింగ్ డైలాగ్స్, అక్కడక్కడా కొన్ని సెంటిమెంట్ సీన్లు.. టిక్కెట్ కొనుకొనుక్కొని థియేట‌ర్‌కు వెళ్ళిన ప్రేక్ష‌కుడి ఎంట‌ర్‌టైన్ చేయ‌డం మాత్రం ప‌క్కా… ఇక చివ‌రిగా చెప్పాలంటే ఈ చిత్ర‌ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన గ‌త చిత్రం నేను లోకల్ రేంజ్‌లో లేక‌పోయిన‌ప్ప‌టికీ ప్రేక్ష‌కుల‌ను మాత్రం నిరాశ‌ప‌ర్చ‌కుండా ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. స్టోరీ స్క్రీన్ ప్లే రొటీన్‌గా అనిపించినా.. ప్రేక్ష‌కుల‌ను ఎక్క‌డా బోర్ కొట్టించ‌దు ఈ చిత్రం. ఇక ఈ చిత్రం యూత్‌కి బాగా క‌నెక్ట్ అయ్యే చాన్స్ ఉండ‌డంతో ఈ సినిమా హిట్ క్ల‌బ్‌లో చేరే అవకాశాలు ఉన్నాయ‌ని చెప్పొచ్చు.

సరదాగా సాగిపోయే ఎమోషనల్ డ్రామా..

Reviewed By 123telugu.com |Rating : 3.25/5

హలో గురూ.. రొటీన్ సినిమానే..

Reviewed By Tupaki.com|Rating : 2.5/5

కామెడీ ఎంట‌ర్ టైన‌ర్..

Reviewed By Chitramala.com|Rating : 3/5

హలో గురు ‘మామ’ కోసమే..!

Reviewed By greatandhra.com|Rating : 2.75/5

హ‌లోగురు రొటీన్ గురు..!

Reviewed By indiaglitz.com|Rating : 2.5/5