హిట్టా లేక ఫట్టా: కవచం – కేవలం యాక్షన్ ప్రేక్షకులకు మాత్రమే

Friday, December 7th, 2018, 04:30:47 PM IST

తన కెరీర్ మొదలు పెట్టిన ఆదిలోనే వి వి వినాయక్ లాంటి అగ్ర దర్శకునితోనే “అల్లుడు శీను” చిత్రంతో మంచి విజయాన్ని అందుకని, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గత కొంత కాలం నుంచి సరైన హిట్ లేక సతమతమవుతున్న తరుణంలో మళ్ళీ ఒక సారి తన అదృష్టం పరీక్షించుకోవడాని ఈ సారి శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో కాజల్ మరియు మెహ్రిన్ హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం “కవచం” తో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం రండి.

ఇక కథలోకి వెళ్లినట్టయితే ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ నిజాయితీ,భాద్యత గల పోలీస్ అధికారిగా అద్భుత నటనను కనబర్చారు.ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ యొక్క పాత్ర కీలకమైనది గా చెప్పొచ్చు.అంతే కాకుండా మెహ్రీన్ పాత్ర కూడా ఈ చిత్రంలో కీ రోల్ పోషించింది అనే చెప్పాలి.మొదటి గంట ఎదో అలా సాగినా ఇంటర్వెల్ కి వచ్చేసరికి ఊహించని ట్విస్టులతో మంచి హైప్ తెచ్చుకుంటుంది. చివరి అరగంటలో వచ్చే సన్నివేశాల్లో నీల్ నితిన్ నటన మెచ్చుకొని తీరాల్సిందే.ఇక మిగిలిన నటీనటులు వారి పరిధి మేరకు పర్వాలేదనిపించారు.ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచి ప్లస్ అయ్యింది.థమన్ అందించిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ చిత్రానికి మంచి హైలైట్ అని చెప్పొచ్చు.

కేవలం కొన్ని సన్నివేశాల మీదనే పెట్టిన శ్రద్ధ దర్శకుడు మిగతా సన్నివేశాల మీద పెట్టడంలో విఫలమయ్యారు.అరకొరగా కొన్ని యాక్షన్ సన్నివేశాలు,ఇంటర్వెల్ బ్యాంగ్ తప్ప ఫస్టాఫ్ లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమి లేదు.ఇంటర్వెల్ సమయానికి పెంచిన అంచనాలను దర్శకుడు ఆ తర్వాత నిలబెట్టుకోలేకపోయాడు.దానికి తోడు సెకండాఫ్ కూడా కాస్త సాగదీతగానే ఉంటుంది.సెకండాఫ్ లో హీరో మరియు విలన్ మధ్య సాగే ఆసక్తికర సన్నివేశాలు కొన్ని చోట్ల తేలిపోతాయి.అంతే కాకుండా సెకండాఫ్ లో కొంతమంది పాత్రలను ఏదో ఇరికించి పెట్టినట్టుగా ఉంటుంది.

మొత్తానికి ఈ చిత్రం కాస్త బాగుంది అని అనిపించే లోపే ప్రేక్షకులకు కాస్త నిరుత్సాహాన్ని కూడా ఇస్తుంది.కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ మీదనే దర్శకుడు దృష్టి పెట్టడం వల్ల మాస్ అభిమానులకు తప్ప కుటుంబ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోవచ్చు.మొత్తంగా చూసుకుంటే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలవొచ్చు.

123telugu.com.com Rating : 2.75/5 – ఈ కవచం మాస్ ప్రేక్షకులకు మాత్రమే.
timesofindia.com Rating : 2/5 – కథ మీద ఇంకా ఎక్కువ దృష్టి పెట్టాల్సింది.
tupaki.com Rating : 2.25/5 – కవచం.. కంగాళీ థ్రిల్లర్.
greatandhra.com Rating : 2/5 – పర్వాలేదనిపించే పోలీస్ థ్రిల్లర్.
gulte.com Rating : 2.5/5 – కొంచెం బాగానే ఉన్నా కొంచెం కష్టంగానే ఉంది.