హిట్టా లేక ఫట్టా : నాటకం – ఆసక్తికరంగా సాగని ప్రేమకథ

Friday, September 28th, 2018, 05:50:50 PM IST

చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించినటువంటి RX 100 తరహాలోనే, నూతన నటీనటులు ఆశిష్ గాంధీ అషీమా నర్వల్ హీరో హీరోయిన్లుగా,నూతన దర్శకుడు గొనగ కళ్యాన్జీ దర్సకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నాటకం.ప్రేక్షకులలో ఊహించిన స్థాయిలో కాకుండా చిన్న సినిమాలలో పర్వాలేదనే విధంగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు.ఈ చిత్రం మొదట్లోనే ఒక దోపిడీతో ప్రారంభం అవుతుంది. హీరో ఆశిష్ గాంధీ తన గ్రామంలో అల్లరి చిల్లరిగా తిరిగే సాదా సీదా కుర్రాడు,జీవితంలో త్వరగా స్థిర పడిపోవాలని అనుకునే తరుణంలో అషిమా నర్వల్ ను చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడాతాడు.ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకొని శారీరకంగా కూడ ఒక్కటయ్యి పెళ్లి కూడా చేసుకున్న తర్వాత అషిమా కోసం కోసం కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుస్తాయి.

ఈ చిత్రం మొదలవ్వడమే ఆసక్తికరంగా మొదలవ్వడంతో ప్రేక్షకులలో ఒక రకమైన ఉత్సుకత మొదలవుతుంది,హీరోగా ఆశిష్ గాంధీ చక్కటి ప్రతిభ కనబర్చారు.మొదటి సగంలో వచ్చే కొన్ని ట్విస్టులు మరింత ఆసక్తి నెలకొల్పుతాయి,దర్శకుడు కూడా ఒక మంచి కథనే ఎంచుకున్నారు అని చెప్పాలి,దానికి తోడు హీరోయిన్ అషీమా కూడా తన అంద చందాలతో బాగానే మెప్పిస్తుంది.చిత్రం ఫస్టాఫ్ అంతా బాగానే నడుస్తుంది.కానీ సెకండాఫ్ కి వచ్చేసరికి దర్శకుడు ఎంచుకున్న కథాంశం కొన్ని సందర్భాల్లో ఎందుకు ఎక్కడికి వెతుందో కూడా అర్ధం కాదు,కొన్ని అనవసరమైన ట్విస్టులకు కూడా ప్రేక్షకులు అంతలా ఇంప్రెస్స్ కూడా కారు.దానికి తోడు కొన్ని విసుగు తెప్పించే సన్నివేశాలు…మొత్తానికి మంచి కథనే ఎంచుకున్న దర్శకుడు దాన్ని సరిగ్గా ప్రెసెంట్ చెయ్యడంలో విఫలమయ్యాడనే చెప్పాలి.

నాటకం – ఆసక్తికరంగా సాగని ప్రేమకథ

Reviewed By 123telugu.com |Rating :2.5/5

నాటకం – ఒక గమ్యం లేని ప్రయాణం

Reviewed By timesofindia.com |Rating :1.5/5

ఈ నాటకం అంత ఆకట్టుకోలేదు.

Reviewed By manacinema.com |Rating : 2.5/5