హిట్టా లేక ఫట్టా: విన‌య విధేయ రామ.. బోయ‌పాటి హింసాత్మ‌క‌ ర‌చ్చ మామ‌..!

Friday, January 11th, 2019, 06:40:22 PM IST

ఊరమాస్ డైరెక్ట‌ర్ బోయపాటి – మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన భారీ చిత్రం విన‌య విధేయ రామ‌. బాలీవుడ్ భామ కైరా అద్వానీ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత డి.వి.వి దాన‌య్య నిర్మించారు. రంగ‌స్థ‌లం లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ తర్వాత చ‌ర‌ణ్ న‌టించిన చిత్రం కావ‌డం, మ‌రోవైపు బోయ‌పాటి శ్రీను మాస్‌కా బాప్ కావ‌డంతో ఈ చిత్రం పై ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు పెంచేశాయి. మ‌రి సంక్రాంతి కానుక‌గా ఈరోజే థియేటర్ల‌లోకి వ‌చ్చిన విన‌య విధేయ రామ చిత్రం హిట్టా ఫ‌ట్టా అనేది తెలుసుకుందాం.

విన‌య విధేయ రామ ట్రైల‌ర్ ఏంటి ఇంత దారుణంగా కట్ చేసిన వారికి స‌మాధాన‌మే ఈ చిత్రం. అస‌లు బోయ‌పాటి చెప్పిన క‌థ‌లో ఏముంద‌ని చ‌ర‌ణ్ ఒకే చేశాడో అర్ధం కాదు. దృవ, రంగస్థలం సినిమాల తర్వాత రామ్ చరణ్ మైండ్ సెట్ పూర్తిగా మారిపోయిందని అనుకుంటున్న టైమ్‌లో మ‌రోసారి క‌మ‌ర్షియ‌ల్ ఇత్రానికి ఓకే చెప్పిన రామ్ చ‌ర‌ణ్‌కు పెద్ద షాకే తిగిలింద‌ని చెప్పాలి. మాస్ డైరెక్ట‌ర్ అయిన బోయ‌పాటి చిత్రాల్లో న‌రుక్కోవ‌డాలు, ర‌క్త‌పాతం కామ‌నే అయ‌తే విన‌య విధేయ రామ‌లో మ‌రీ అతి ఎక్కువైంద‌ని చెప్పాలి.

సినిమా ఫస్టాఫ్‌లో ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో పాటు, కొన్ని ఆక‌ట్టుకునే స‌న్నివేశాల‌తో బాగానే మ్యానేజ్ చేసిన బోయ‌పాటి, సెకండ్‌హాఫ్ మితిమీరిన యాక్ష‌న్స్ పై ఫోక‌స్ పెట్టి పూర్తిగా ప‌ట్టుకోల్పోయాడు. త‌లలు నరికితే.. గాల్లో పైకి ఎగిరిన త‌ల‌ల్ని అక్క‌డే ఎగురుతున్న గ్ర‌ద్ద‌లు ప‌ట్టుకు పోవ‌డం.. విష‌పూరిత‌మైన‌ పాము కరిస్తే మనిషి చనిపోకుండా పామే తిరిగి చనిపోవడం, అన్న‌య్య ప్ర‌మాదంలో ప‌డే సీన్ చూస్తే.. చ‌ర‌ణ్ గ్లాస్‌డోర్లు ప‌గ‌ల గొట్టి మ‌రీ, ఎయిపోర్ట్‌నుండి బ‌య‌ట‌కు వ‌చ్చి, రైల్వే స్టేష‌న్‌కి వెళ్ళే టైమ్ లేక వంతెన మీద నుండి ఏకంగా ర‌న్నిగ్ ట్రైన్ ఎక్క‌డం.. మెగా అభిమానులు సైతం త‌ల‌లు ప‌ట్టుకునేలా సీన్లు డిజైన్ చేశారు.

బోయ‌పాటి చిత్రాల్లో క‌థ ఎలా ఉన్న ఎంగేజింగ్ సీన్లతో ప్రెజెంట్ చేసి ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాడు. అయితే ఈ చిత్రంలో అలాంటి భావోద్వేగ స‌న్నివేశాలు లాజిక‌ల్‌గా లేక‌పోవ‌డం, యాక్ష‌న్స్ మీద యాక్ష‌న్స్ రావ‌డంతో ప్రేక్ష‌కుల‌కు చిరాకు తెప్పిస్తాయి. అయితే రామ్ చ‌ర‌ణ్ మాత్రం త‌న‌వంతుగా చేయాల్సిందంతా చేశాడు. ప్ర‌తి ఫ్రేంలో చ‌ర‌ణ్ ప‌డిన క‌ష్టం కనిపిస్తోంది. తొలిసారి సిక్స్‌పాక్‌తో ద‌ర్శ‌న‌మిచ్చిన చెర్రి, డాన్స్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్, యాక్షన్ సన్నివేశాల్లో బెటర్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఇక కైరా అద్వానీ నాలుగు సీన్లు, పాట‌ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. విలన్ పాత్ర‌లో న‌టించిన బాలీవుడ్ యాక్ట‌ర్ వివేక్ ఒబెరాయ్, పులిహార్ విల‌న్ క్యారెక్ట‌ర్‌లో త‌న ప‌రిదిమేర‌కు న‌టించాడు.

ఇక చరణ్‌కి అన్న‌ద‌మ్ములుగా న‌టించిన ప్ర‌శాంత్‌, ఆర్య‌న్‌ రాజేష్‌, మ‌ధునంద‌న్‌, ర‌వివ‌ర్మ ,స్నేహ, హేమ, పృథ్వీ చాలా చక్కగా అందంగా కనిపించింది. ఇంకా మధుమిత, ముఖేష్ ఋషి ఉన్నంతలో త‌మ పాత్ర‌ల మేర‌కు పర్వాలేదనిపించారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ ఇచ్చిన మ్యూజిక్ ఇప్ప‌టికే తేలిపోగా.. బ్యాంగ్రౌండ్ కూడా సోసోగా ఉంది. ఆర్థర్ విలియమ్ సన్ సినిమాటోగ్రఫీ బాగుంది. కణల్ కణ్ణన్ స్టంట్స్ కాస్త ఓవర్‌గా అనిపిస్తాయి. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. డీవీవీ దానయ్య బడ్జెట్ భారీగా పెట్టడంతో సినిమా రిచ్‌గా కనిపిస్తుంది. ఫైన‌ల్‌గా చెప్పాలంటే.. రంగ‌స్థ‌లంతో చ‌ర‌ణ్‌కు రేంజ్‌లో వ‌చ్చిన‌ ఇమేజ్ అంతా.. బోయ‌పాటి దెబ్బ‌కి మొత్తం పోయింద‌ని ప్రేక్ష‌కులు తేల్చేశారు.

123telugu.com.com Rating : 2.75/5 – చరణ్ ఆకట్టుకున్నా.. సినిమా ఆకట్టుకోదు !
news18.com Rating : 1.5/5 – అంతా విధ్వంసమే
greatandhra.com Rating : 2/5 – విలయ వినాశక రామా!
Gulte.com Rating : 2/5 – అయ్యే రామ‌ !
Tupaki.com Rating : 2/5 – విలయం.. విధ్వంసం
cinejosh.com Rating : 2.25/5 – బ్ల‌డీ యాక్ష‌న్
hindustantimes.com Rating : 0.5/5 – cannot punch his way out of.