హిట్టా లేక పట్టా : సుబ్రహ్మణ్యపురం – సస్పెన్స్ థ్రిల్లర్.

Friday, December 7th, 2018, 03:58:50 PM IST

అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో సుమంత్ కూడా ఒకరు.అయితే మొదట్లో మంచి ప్రేమకథా చిత్రాలు తీసి తెలుగు ప్రేక్షకుల్లో మంచి మార్కులే కొట్టేసారు.ఆ మధ్య కొన్ని మాస్ సినిమాలు ప్రత్నించినా అవి అంతగా ఫలించలేదు. చాలా గ్యాప్ తర్వాత “నరుడా డోనరుడా” అనే ప్రయోగం చేసినా సరే అది కూడా అంతగా ఆకట్టుకోలేదు.దానితో మళ్ళీ తనకి అచ్చొచ్చిన ప్రేమ కథా చిత్రంతోనే మళ్ళీ మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.ఇప్పుడు మళ్ళీ “సుబ్రహ్మణ్యపురం” అనే చిత్రంతో మరో ప్రయోగాన్ని చేపట్టారు.మరి ఈ చిత్రం ప్రేక్షుకుల దగ్గర ఎంత వరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.

ఇక కథలోకి వెళ్లినట్టయితే కృష్ణ(సుమంత్) ముందు నుంచి నాస్తికుడు.ఈ సృష్టిలో దేవుడు లేడు అని నమ్మే వ్యక్తి.అయితే అనూహ్యంగా సుభ్రహ్మణ్యపురం అనే గ్రామంలో అంతుచిక్కని పరిస్థితిలో అక్కడి గ్రామస్థులు అంతా చనిపోతుంటారు.అక్కడ అసలు ఏం జరుగుతుందో వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో కూడా అర్ధం కానీ విధంగా దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ప్రేక్షకులను కట్టిపడేసేలా ఆద్యంతం ఆసక్తికరంగా చిత్రాన్ని నడిపించడంలో విజయం సాధించారనే చెప్పాలి.మొదటి సగభాగం లో వచ్చేటటువంటి కామెడీ సన్నివేశాలు పర్వాలేదనిపించేలా ఉంటాయి.అసలు సినిమా మొదలవ్వడంతోనే రానా వాయిస్ ఓవర్ తో ఆసక్తికరంగా కొనసాగుతుంది.ఇంటర్వెల్ వరకు దర్శకుడు దాన్ని బాగానే క్యారీ చేసుకుంటూ వచ్చారు అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు.సందర్భానుసారం వచ్చే కీలక ట్విస్టులు ప్రేక్షుకులను కట్టిపడేస్తాయి.సుమంత్ మరియు ఈషా రెబ్బ మధ్యలో వచ్చే సన్నివేశాలు కూడా చక్కగా ఉంటాయి.మంచి మంచి ట్విస్టులతో మొదటి సగం అంతా రెండో సగం మీద ఆసక్తి పెంచేలా ఉంటుంది.

ఇక రెండో సగానికి వచ్చినట్టయితే మొదటి సగంలో నెలకొల్పిన ఆసక్తిని సెకండాఫ్ లో కూడా దర్శకుడు చాలా బాగా హ్యాండిల్ చేసారు.కొన్ని చోట్ల ఎడిటింగ్ విధానం మాత్రం అంతగా మెప్పించదు,దాని మీద దర్శకుడు ఎక్కువ దృష్టి పెడితే బాగున్ను.నిర్మాణ విలువలు కూడా ఈ చిత్రానికి అంతంత మాత్రంగానే ఉంటాయి.దానికి తోడు ఈ చిత్రం చూసినంతసేపు నిఖిల్ యొక్క కార్తికేయ చిత్రం కూడా ఖచ్చితంగా గుర్తుకొస్తుంది.ఇక ఇవి మాత్రం మినహాయించి,మిగతా సినిమా అంతా దర్శకుడు అద్భుతంగా తీర్చిదిద్దారు.

ఎప్పటి నుంచో సరైన హిట్ లేక సతమతమవుతున్న సుమంత్ కు ఈ చిత్రం తన కెరీర్ లో “సుబ్రహ్మణ్యపురం” చిత్రంతో సుమంత్ మరో విజయం సాధించారనే చెప్పాలి.మొత్తానికి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవొచ్చు.

Teluguin.com Rating : 3.5/5 – సస్పెన్స్ థ్రిల్లర్.