హిట్టా లేక ఫట్టా : నర్తనశాల – ప్రయత్నం బాగుంది..కానీ!

Thursday, August 30th, 2018, 11:30:55 PM IST

యంగ్ హీరోకి నాగ శౌర్య హీరోగా, ఐర క్రేయేషన్స్ పతాకంపై అయన తల్లి ఉష మూల్పూరి నిర్మాణ సారథ్యంలో నూతన దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో రూపొందిన చిత్రం నర్తనశాల. కాగా నేడు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందొ తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే, తన తండ్రి బ్రతకడం కోసం తల్లినే కూతురుగా పుట్టాలని కోరుకుంటాడు కళామందిర్ కళ్యాణ్ (శివాజీరాజా). అయితే అతినికి మాత్రం కొడుకు (నాగశౌర్య) పుడతాడు. ఇక అప్పటినుండి తండ్రి ప్రాణాల కోసం కొడుకుని, అమ్మాయిలా పెంచే ప్రయత్నం చేస్తుంటాడు కళ్యాణ్. అలా పెరిగే క్రమంలో శౌర్య కు మెల్లగా ఆడవారి సమస్యలు మరియు బాధలు కొన్ని అర్ధమవుతాయి. అందుకే అతడు పెరిగి పెద్దయ్యాక ఆడవారికోసం ఒక సెల్ఫ్ డిఫెన్స్ స్కూల్ ని కూడా నెలకొల్పుతాడు. ఇక ఆ సమయంలో తన సమస్యను పరిష్కరించుకోవడానికి అక్కడకు వచ్చిన మానస (కాశ్మీర పరదేశి)ని ప్రేమిస్తాడు శౌర్య.

అయితే అతడిని సత్యభామ (యామిని భాస్కర్) అనే అమ్మాయి కూడా ప్రేమిస్తూ ఉంటుంది. కాగా అతని తండ్రి కళ్యాణ్ సత్యభామ మరియు శౌర్య ప్రేమించుకుంటున్నారు అనుకుని వారిద్దరికీ పెళ్లి చేయాలనీ నిర్ణయించుకుంటాడు. ఆ తరువాత సత్యకు శౌర్యకు పెళ్లి జరుగుతుందా, మరి యామినిని ప్రేమించిన శౌర్య ఆమెకు తన ప్రేమ విషయం చెపుతాడా, చివరికి శౌర్యకు ఎవరితో పెళ్లి జరుగుతుంది అనేది మిగతా కథ. సినిమాని దర్శకత్వం వహించిన దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి ఎక్కువగా సినిమాలో కామెడీ పైనే శ్రద్ధ పెట్టాడు. సినిమాని ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసాడు. ఇక హీరో నాగ శౌర్య గే పాత్రలో మంచి నటన కనపరిచాడు అని చెప్పాలి. ముఖ్యంగా కొన్ని సీన్లలో అతడు ఎదుర్కొనే సమస్యలకు మనకు నవ్వు ఆగదు. ఇక హీరోయిన్లు గా నటించిన కాశ్మీర పరదేశి, యామిని భాస్కర్ తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించి ఆకట్టుకున్నారు. ఇక ముఖ్యంగా హీరో తండ్రిగా నటించిన శివాజీరాజా సినిమాలో మంచి మార్కులు కొట్టేస్తారు. ఇక యాక్టర్ అజయ్ నటన సినిమాలో అందరిని ఆకట్టుకుంటుంది అని చెప్పాలి

జయప్రకాష్ రెడ్డి, రాకెట్ రాఘవ తమ సన్నివేశాల్లో కామెడీని బాగా పండించారు. సినిమాలో దర్శకుడి పనితీరు ఆకట్టుకున్నప్పటికీ, చాలావరకు లొసుగులు సినిమాలో కనపడతాయి. ముఖ్యంగా మంచి పాయింట్ ని తీసుకున్న దర్శకుడు దానిని తెరపై చూపించడంలో మాత్రం చాలావరకు తడపడ్డాడు. పెద్దగా ఆకట్టుకొని స్క్రీన్ ప్లే, బోర్ కొట్టిస్తూ, ఏదో ఆలా ఆలా సాగిన ఫస్ట్ హాఫ్. ఇక నెమ్మదిగా సాగె కథనంతో కొంత సాధారణ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టె సెకండ్ హాఫ్. వెరసీ చిత్రాన్ని ప్రేక్షకాదరణ పొందే చిత్రంగా నిలుపలేకపోయాయి. ఇక కొన్ని సన్నివేశాలు అసహజంగా అనిపించడంతో అవి ఎందుకు పెట్టారా అనిపిస్తుంది. అయితే బిసి సెంటర్లలో మంచి కామెడీ కోరుకునే వారికీ మాత్రం ఈ చిత్రం అలరించే అవకాశం కనపడుతోంది. ఇక కెమెరా మాన్ విజయ్ సి కుమార్ కెమెరా పనితనం బాగుంది, సినిమాలో ఎడిటింగ్ బాగున్నా, మరింత శ్రద్ధ పెడితే బాగుండేదేమో అనిపిస్తుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ మహతి సాగర్ చలో రేంజిలో కాకపోయినా పర్వాలేదనిపించే పాటలు ఇచ్చాడు. సినిమాలో నిర్మాణ విలువలు మంచి లావిష్ గా వుండి, కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుడిని అలరిస్తాయి. ఇక మొత్తంగా చూస్తే, ఈ నర్తనశాల చిత్రం ప్రయత్నం బాగున్నప్పటికీ, ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోదు అని చెప్పకతప్పదు….

నర్తనశాల – కామెడీతో వచ్చినా మెప్పించలేకపోయాడు

Reviewed By 123telugu.com |Rating :2.5/5

నర్తనశాల.. అంతా గోల గోల

Reviewed By tupaki.com |Rating :2.5/5

నర్తనశాల….మీ ఇష్టం మేరకు చూడవచ్చు

Reviewed By gulte.com |Rating : 2/5

నర్తనశాల..నవ్వులపాలు

Reviewed By www.greatandhra.com|Rating : 1/5


 


  •  
  •  
  •  
  •  

Comments