హిట్టా లేక ఫట్టా : నేలటిక్కెట్టు – టికెట్ డబ్బులకు సరిపడా కిక్ ఇవ్వదు

Friday, May 25th, 2018, 04:24:06 PM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా, మాళవిక శర్మ హీరోయిన్ గా సోగ్గాడే చిన్నినాయనా, రారండోయి వేడుక చూద్దాం చిత్రాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నిర్మితమై నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం నేలటిక్కెట్టు. మంచి అంచనాల మధ్య విడుదలయిన ఈ చిత్రం మాస్ మహారాజ ఫెయిల్యూర్స్ లిస్ట్ లో మరొకటిగా చేరే అవకాశం కనపడుతోంది. విడుదలయిన తొలి ఆట నుండి చిత్రానికి చాలా వరకు నెగటివ్ టాక్ వినిపిస్తోంది. కథలోకి వెళితే అనాధలా పెరిగిన నేల టిక్కెట్టు (రవితేజ) చుట్టూ జనం, మధ్యలో మనం, జీవితమంటే మన చుట్టూవున్న వారందరిని కలుపుకు పోవాలి అనే తత్వంతో తన చుట్టూ వున్న వారికి తనవంతు సాయం అందిస్తుంటాడు. అయితే అతను అందరికి సాయం చేస్తూ వెళ్లే ఒకానొక సమయంలో హోమ్ మంత్రి ఆదిత్య భూపతి తో గొడవ పెట్టుకోవలసిన సందర్భం వస్తుంది.

ఆ తరువాత ఒక సందర్భంలో ఆదిత్య భూపతితో తాను కావాలనే గొడవపెట్టుకుంటున్నట్లు చెపుతాడు నేల టిక్కెట్టు. అసలు నేలటిక్కెట్టు ఆదిత్య భూపతిని ఎందుకు టార్గెట్ చేసాడు. అతనికి, హోమ్ మంత్రికి ఏంటి సంబంధం ఏంటి. హోమ్ మంత్రి చేసిన తప్పేమిటి అనేది తెలియాలంటే తెరమీద చూడాల్సిందే. ఇక సినిమాలో మాస్ మహారాజ రవితేజ సినిమాని తన భుజాలపై వేసుకుని మోసే ప్రయత్నం చేసాడు. ఎప్పటిలానే సినిమాలో ఆయన ఎనర్జి లెవెల్స్, ఎంటర్టైన్మెంట్ తో కూడిన సన్నివేశాల్లో ఆయన నటన బాగుంది. ఇక రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు కళ్యాణ్ కృష్ణ రాసుకున్న డైలాగ్స్ ను అయన పలికి పండించిన విధానం అద్భుతంగా వుంది.

ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని ఫన్నీ సన్నివేశాలు బాగున్నాయి. మన చుట్టూ వుండే మనుషులతో కలిసి ఉండాలి, అందరితోనూ కలసి జీవించేదే జీవితం అని దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. ఇక ఇంటర్వెల్ సీన్ బాగా ఎలివేట్ అయి సెకండ్ హఫ్ మీద మంచి ఆసక్తిని పెంచుతుంది. కమెడియన్లు పృథ్వి, ప్రియదర్శి, అలీల నటన, వారి హాస్య సన్నివేశాలు కొంతవరకు ఆకట్టుకుంటాయి. ఇక దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సినిమాలో ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ, దానిని తెరమీద చూపించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని చెప్పుకోవాలి. హీరో పాత్రకు అక్కడక్కడా వచ్చే కొన్ని ఫన్నీ సీన్స్, అలానే ఇంటర్వెల్ బ్లాక్ తప్పించి మరే సన్నివేశాలు ఆకట్టుకోవు. ఇంటర్వెల్ వరకు హీరో పాత్ర ఎటుపోతుందో, అతని లక్ష్యమేమిటో కూడా పూర్తిగా అర్ధం కాదు. ఇక ఇంటర్వెల్ అయ్యాక సెకండ్ హాఫ్ ఖచ్చితంగా బాగుంటుంది అనుకున్న వాళ్లకు పూర్తి నిరాశే ఎదురవుతుంది. సెకండ్ హాఫ్ లో హీరో ప్రయాణం, బోర్ కొట్టించే సన్నివేశాలు విసుగు తెప్పిస్తాయి. ఇక హీరో హీరోయిన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు అసలు ఆకట్టుకోవు.

సినిమాలో కథనం బాగోకపోయినప్పటికీ, కనీసం సన్నివేశాలయినా బాగుంటాయి అంటే వ]అవి అసాలుబాగాలేక సీట్ లో కూర్చున్న ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తాయి. సినిమా చూస్తున్నంత సేపు అసలు ఇది సోగ్గాడే చిన్ని నయనే తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ సినిమానేనా అనిపిస్తుంది. సినిమాలో హీరో పాత్ర తప్ప మరొక బలమైన పాత్రలు కనపడవు. ఇక జగపతి బాబు, బ్రహ్మానందం, పోసాని, అలీ వంటి వారిని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు. ఇక మధ్యలో వచ్చే పాటలైతే పరమ విసుగు పుట్టిస్తాయి. ఫిదా చిత్రానికి సంగీతం ఇచ్చిన శక్తీ కాంత్ పాటలేనా ఇవి అనిపించక మానవు. మొత్తంగా చూస్తే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వ ప్రతిభ పూర్తిగా ఫెయిల్ అయింది, మంచి పాయింట్ ఎంచుకున్నప్పటికీ, పేలవమైన కథనం, బోర్ కొట్టించే రొటీన్ సన్నివేశాలతో ప్రేక్షకుడి సహనానికి పరీక్షపెట్టాడు. ఇక ముకేశ్ జి ఫోటోగ్రఫీ ఏదో పాత కాలం నాటి చిత్రం చూస్తున్న ఫీలింగ్ ని ఇస్తుంది. ఇక ఎడిటర్ చోట కే ప్రసాద్ అనవసరమైన సన్నివేశాల్ని తొలగించినట్లైతే బాగుండు అనిపిస్తుంది. చివరిగా చెప్పాలంటే ఈ నేల టిక్కెట్టు చూసిన వారి టిక్కెట్టు డబ్బులకు సరిపడా వినోదాన్ని అందివ్వలేకపోయింది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు……

నేల టిక్కెట్టు – ఎంటర్టైన్మెంట్ ఇవ్వదు

Reviewed By 123telugu.com |Rating :2.25/5

నేలబారు సినిమా

Reviewed By greatandhra.com |Rating :1.5/5

నేల టిక్కెట్టు.. నేలటిక్కెట్ రోజుల నాటి సినిమా

Reviewed By tupaki.com |Rating :1.75/5

కాలం చెల్లిన సినిమా

Reviewed By gulte.com|Rating : 2/5


 


  •  
  •  
  •  
  •  

Comments