హిట్టా లేక ఫట్టా : పేపర్ బాయ్ – రొటీన్ ప్రేమ కథ!

Friday, August 31st, 2018, 07:03:38 PM IST

దివంగత దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన నూతన చిత్రం పేపర్ బాయ్. దర్శకుడు సంపత్ నంది కథ అందించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం కథ, కమామిషు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పేపర్ బాయ్ గా జీవితాన్ని గడుపుతున్న రవి, తొలి చూపులోనే ధరణి (ప్రియా రాయ్)ని లవ్ చేస్తాడు. అయితే పెద్ద ఇంటి అబ్బాయి అయిన రవి గొప్పింటి అమ్మాయి ధరణిని లవ్ చేయడంతో, వారి మధ్య అంతరాలుఏర్పడుతాయి. .అయితే ఎలాగైనా రవిని తన పెద్దవాళ్ళని పెళ్ళికి ఒప్పించమని చెపుతుంది ధరణి. ఆ పయనంలో మధ్యలో కొన్న్ని ట్విస్టులు, దానితో పేద, ధనిక అనే అంతరాలు వారి మధ్య ఎలా తొలగిపోతాయి. చివరకు రవి, ధరణి వాళ్ళ పెద్దలను ఒప్పించి ఆమెను ఎలా పెళ్లి చేసుకుంటాడు అనేది మిగతా కథ. చెప్పుకోవడానికి ఇది పేద, మరియు ధనిక వారి మధ్య ఎన్నేళ్ళనుండో వస్తున్న ప్రేమికుల తరాలకు సంబందించిన కథ అయినప్పటికీ దర్శకుడు జయశంకర్ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటుంది.

ముఖ్యంగా సినిమాలో డైలాగులు నచ్చుతాయి అని చెప్పవచ్చు. ఇక హీరో సంతోష్ తన నటనతో కొట్టేశాడు. ముఖ్యంగా అతడు ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా బాగా నటించాడని చెప్పుకోవాలి. ఇక హీరోయిన్ ప్రియా రాయ్ తన పాత్రా పరిధి మేరకు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంచేసిందనే చెప్పుకోవాలి. ఇకపోతే కామెడీ అవసరం లేనప్పటికీ బిత్తిరి సత్తి మరియు విద్యుల్లేఖ తమ సన్నివేశాలతో మంచి కామెడీ పండించారు. ఇక ముఖ్యమా చెప్పుకోవలసింది నటి తాన్యా గురించి. ఆమె తన పాత్రలో ఒదిగిపోయారు, ఇక క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాల్లో ఆమె తన నటనతో కట్టిపడేశారు. ప్రేమకు వున్నవాళ్లు, లేని వాళ్ళు అనే తేడాలు , వారి మధ్య చిగురించే ప్రేమ గురించి దర్శకుడు జయశంకర్ బాగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక సినిమాలో ఫోటోగ్రఫీ సినిమా స్థాయిని మరింత పెంచింది అనే చెప్పుకోవాలి. ఇకపోతే సినిమాలో మైనస్ గా చెప్పుకోవలసింది, కథ. ఎన్నో ఏళ్ళనుండి తీసుకున్న పాత కథ మరియు దాదాపుగా అదే పాత పద్దతిలో తెరకెక్కించిన కథనం ప్రేక్షకులకు అంతగా రుంచించదు. ఇక సినిమాలో హీరో ప్రేమకు హీరోయిన్ అవును అంటుందో,

లేక కాదు అంటుందో మనకు ఖచ్చితంగా అర్ధం కాదు. ఇకపోతే సినిమాలో అవసరం లేని కామెడీని ఇరికించడం. ఫస్ట్ హాఫ్ లో వారి ప్రేమకథను అంతగాచూపించకపోవడం .ఇక సెకండ్ హాఫ్ లో కథ మాములు పాత పద్దతిలో సాగి ప్రేక్షకుడికి ఒక రొటీన్ ప్రేమ కథా చిత్రం చూస్తున్న ఫీలింగ్ ఇవ్వడం ముఖ్యంగా మైనస్ గా చెప్పుకునే అంశాలు. చిత్రానికి సంపత్ నంది ఇచ్చిన కథ బాగున్నప్పటికీ ఎక్కడికక్కడ సన్నివేశాలను ముందే ఊహించడం, రొటీన్ ప్రేమకథ ఫార్ములా మాదిరి మలచడంతో దర్శకుడు మరింత కొత్తగా కథనాన్ని నడిపితే బాగుండేది అనిపిస్తుంది. కొత్త దర్శకుడైనప్పటికీ కొంతవరకు చిత్రాన్ని బాగా తీయడానికి ప్రయత్నించాడు అని చెప్పుకోవాలి. ఒక సినిమాలో పాటలు పర్వాలేదనిపిస్తాయి. సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం బాగా కష్టపడి తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఇక మొత్తంగా చూస్తే ఈ పేపర్ బాయ్ చిత్రం పర్వాలేదనిపించే ముక్కలు ముక్కలుగా సాగె ప్రేమకథా చిత్రంగా అనిపించి, బాక్సాఫీస్ వద్ద యావరేజ్ చిత్రంగా నిలిచే అవకాశాలు కనపడుతున్నాయి…..

పేపర్ బాయ్ – డీసెంట్ ఎమోషన్స్ ఉన్న రొటీన్ లవ్ స్టోరీ !

Reviewed By 123telugu.com |Rating :3/5

పేపర్ బాయ్ – మధ్యలో దారి తప్పాడు

Reviewed By Tupaki.com |Rating :2.5/5

పేపర్ బాయ్ – రొటీన్ లవ్ స్టోరీ

Reviewed By chitramala.com |Rating : 2.5/5

పేపర్ బాయ్ – రొమాంటిక్ డ్రామా…

Reviewed By telugumirchi.com|Rating : 2.75/5


 


  •  
  •  
  •  
  •  

Comments