హిట్టా లేక ఫట్టా : విశ్వరూపం-2 : అంచనాలను అందుకోలేదు!

Friday, August 10th, 2018, 03:36:39 PM IST

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా అయన స్వీయ దర్శకత్వంలో గతంలో వచ్చిన చిత్రం విశ్వరూపం. ఎన్నో వివాదాల నడుమ అప్పట్లో విడుదలయిన ఆ చిత్రం మంచి విజయవంతం అయింది. ఇక దాదాపు ఐదేళ్ల తరువాత దానికి సీక్వెల్ గా వచ్చిన విశ్వరూపం-2 నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే నేడు విడుదల అయిన సినిమాపై ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. భారత దేశంలోని రా ఆదేశాలతో విసామ్ అహ్మద్ కాశ్మీరీ (కమల్ హాసన్) అల్ ఖైదా ఉగ్రవాదులతో కలిసి వారి విద్రోహ చర్యలను తెలుసుకుని ఎప్పటికపుడు భారత సైన్యానికి సమాచారం అందిస్తుంటాడు. అయితే ఆ విషయం ఉగ్రవాదుల్లో ఒకడైన ఒమర్ ఖురేషి (రాహుల్ బోస్)కు తెలిసిపోతుంది. ఎలాగైనా విసామ్ ని అంతమొందించాలని, అలానే భారత దేశంలోని ఒక 64 ప్రదేశాల్లో బాంబులు ఏర్పాటు చేస్తాడు. అయితే ఆ బాంబులను విసామ్ ఎలా కనుగొని వాటిని నిర్వీర్యం చేసాడు,అలానే ఖురేషిని ఎలా అంతమొందిస్తాడు అనేది అసలు కథ.

ఇక పాత్రల విషయం మాట్లాడుకుంటే, ఎప్పుడు తన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసే కమల్, ఈ చిత్రంలో కూడా విసామ్ పాత్రలో జీవించారని చెప్పాలి. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో అయన పడ్డ శ్రమ మనకు బాగా తెలుస్తుంది. ఇక యూకేలో మొదలైన కథ విసామ్ గూడచారిగా మారడం, ఆ తరువాత అల్ ఖైదా గ్రూప్ లోకి ఎలా ప్రవేశించాడు అనే ఘట్టాలు. తరువాత అతనిపై దాడి జరగడం, అక్కడ జరిగే ఇంటరెస్టింగ్ యాక్షన్ ఎపిసోడ్ ఆకట్టుకుంటాయి. అయితే ఫస్ట్ హాఫ్ అంతగా ఆకట్టుకోదనే చెప్పాలి. ఇక ఇంటర్వెల్ ముందు యుకెలో బాంబు పేలుడు జరగకుండా జరిగే యాక్షన్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో కథ ఢిల్లీకి మారడం, కమల్ కి మరియు అల్జీమర్స్ వ్యాధితో బాధపడే అయన తల్లి (వహీదా రెహమాన్)కి మధ్య వచ్చే సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటాయి.

ఆతరువాత ఖురేషి, విసామ్ తల్లిని మరియు ప్రియురాలి (పూజ కుమార్)ని కిడ్నప్ చేయడం, వారిని రక్షించి ఉగ్ర దాడినుండి దేశాన్ని కాపాడిన విసామ్, ఆ తరువాత ఖురేషిని ఎలా అంతమొందించాడు అనే దానితో సినిమా ముగుస్తుంది. అయితే సెకండ్ హాఫ్ లో తల్లి ఎపిసోడ్ ముగిశాక చాల వరకు సినిమాని కథ లేకుండా డైలాగులతో సాగదీశారు అనిపిస్తుంది. ఇక ప్రీ క్లైమాక్స్ నుండి ఒకింత ఊపుగా సినిమా సాగుతుంది. చివరిగా వచ్చే క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకుడి ఆకట్టుకున్నప్పటికీ, అప్పటికీ పూర్తిగా నిరాశకు గురయిన అతడికి, హమ్మయ్య సినిమా పూర్తవుతోంది అనే ఆనందాన్ని మాత్రమే మిగులుస్తుంది. కమల్ నటన తరువాత నటీమణులు పూజ కుమార్, మరియు ఆండ్రియా తమ పాత్రల నిడివి మేరకు బాగానే నటించారు.

ఇక ఒమర్ ఖురేషీగా రాహుల్ బోస్ నటన చాలా సహజంగా అనిపిస్తుంది. ఇక సీనియర్ నటి వహీదా రహమాన్ తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశారనే చెప్పాలి. సినిమాకి ప్రధాన ఆకర్షణగా జీబ్రాన్ అందించిన నేపధ్య సంగీతం, పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో అయన నేపధ్య సంగీతం ఆ సన్నివేశాలని బాగా ఎలివేట్ చేసినట్లు అనిపిస్తుంది. ఇకపోతే ఫోటోగ్రాఫర్లు శ్యామ్ దత్, షాను జాన్ వర్గీస్ కెమెరా పనితనం సినిమాను హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్తాయి. ఇక యాక్షన్ సన్నివేశాలు సినిమాకి పెద్ద అసెట్ గా చెప్పుకోవచ్చు. ఇక చివరిగా చెప్పుకోవాలంటే, ఈ విశ్వరూపం-2 చిత్రంలో కమల్ నటన మినహాయించి మిగతా చిత్రమంతా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైందనే చెప్పుకోవాలి…

కన్ ఫ్యూజన్ సీక్వెల్

Reviewed By www.123telugu.com |Rating :2.25/5

విశ్వరూపం కాదు

Reviewed By www.tupaki.com |Rating :1.75/5

దారుణమైన సీక్వెల్

Reviewed By www.gulte.com |Rating : 2.5/5

మెప్పించలేదు

Reviewed By andhraheadlines.com|Rating : 2/5


 


  •  
  •  
  •  
  •  

Comments