రోహిత్ నెక్స్ట్ టార్గెట్ ధోనీయే..!

Monday, September 24th, 2018, 04:09:27 PM IST

ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ మ్యాచుల్లో భారత జట్టు ముందు కాస్త తడబడినా తర్వాత మాత్రం ఎగసిన కెరటంలా ఓటమి అనే పదం చూడకుండా వరుస విజయాలతో దూసుకెళ్లిపోతుంది.ఈ నేపధ్యంలోనే నిన్న జరిగినటువంటి భారత్ పాకిస్థాన్ మ్యాచ్ లో కూడా రోహిత్ సేన విజయకేతనాన్ని ఎగురవేసింది.భారత జట్టు కెప్టెన్ “హిట్ మ్యాన్” రోహిత్ శర్మ(111), “గబ్బర్” శిఖర్ ధావన్(114) లు సెంచరీలతో పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు.అయితే జట్టు సారధిగా ఉన్నటువంటి రోహిత్ శర్మ ఇప్పుడు ఒక అరుదైన రికార్డును నెలకొల్పాడు.

ఇది వరకు వన్డే మ్యాచుల్లో పాకిస్థాన్ జట్టు మీద సెంచురీ చేసిన మూడో భారత జట్టు సారధిగా రికార్డులకెక్కాడు.కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోని(114) మరియు అజారుద్దీన్(101,100) లు ఇది వరకే పాకిస్థాన్ జట్టు మీద సెంచరీ చేసి రికార్డులకెక్కారు.ఇప్పుడు వీరిలో రోహిత్ నిన్న సెంచరీతో అజారుద్దీన్ ని దాటి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.ఇప్పుడు తన తర్వాతి టార్గెట్ లో మహేంద్ర సింగ్ ధోనీయే ఉన్నాడు.ఇదే తరహా బ్యాటింగ్ ను రోహిత్ కొనసాగిస్తే ధోని పేరిట ఉన్న రికార్డును కూడా తన పేరు మీద రాసేసుకుంటాడు.