ప్రమాదవశాత్తు మరణించిన యువనటుడు

Monday, June 20th, 2016, 11:56:23 AM IST


హాలీవుడ్ నటుడు, స్టార్ ట్రెక్ సిరీస్ లో నటించిన యువ నటుడు ‘ఆంటోన్ ఎల్చిన్’ నిన్న ఆదివారం ఉదయం లాన్ ఏంజిల్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ విషయాన్ని ఆయన పబ్లిసిస్ట్ జెన్నిఫర్ అలెన్ నిర్దారించారు. రిహార్సల్స్ కోసం తన స్నేహితుడి ఇంటికి వెళుతుండగా ఆంటోన్ కారు ప్రమాదానికి గురైంది.

ది స్ముర్ఫ్స్, స్టార్ ట్రెక్, హౌస్ ఆఫ్ డి, ఆల్ఫా డాగ్ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఆంటోన్ తాజాగా విడుదల కాబోతున్న స్టార్ ట్రెక్ మూడవ సిరీస్ లో సైతం నటించాల్సి ఉంది. కానీ ఈలోపే ప్రమాదానికి గురై మరణించాడు. ఈ యువ నటుడి మృతి పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.