బొమ్మ తుపాకీతో గురిపెట్టి ప్రాణాలు కోల్పోయిన నటి!

Saturday, September 1st, 2018, 02:55:16 PM IST

కొన్ని సందర్భాల్లో సరదాగా చేసేపనులు ఊహించని చేదు అనుభవాలను మిగులుస్తాయి. అయితే ఒక నటి ఎందుకు చేసిందో గాని బొమ్మ తుపాకీ వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆమె ఎవరో కాదు హాలీవుడ్‌ నటి వెనెస్సా మార్క్యూజ్‌(49). 1994 నుంచి 1997 వరకూ ప్రసారమైన ‘ఈఆర్‌’ టెలివిజన్‌ సిరిస్‌లో వెనెస్సా తన నటనతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అలాగే ‘సైయిన్‌ఫెల్డ్‌’, ‘మెల్‌రోస్‌ ప్లేస్‌’ వంటి షోల్లో కూడా వెనెస్సా అందరి చూపును ఆకర్షించింది.

అయితే ఇటీవల ఆమె తీరూపై అనుమానం వచ్చి ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. లాస్ ఏంజిల్స్ లో ఆమె ఉన్న ఇంటిని తనిఖీ చెయ్యాలని చెప్పడంతో పోలీసులు దాదాపు గంటకుపైగా తనిఖీలు నిర్వహించారు. అయితే తనిఖీ చేసే సమయంలో వెనిస్సా ఒక రకమైన మత్తులో ఉందని ఆమెకు వైద్యం అందించాలని పోలీసులు అనుకున్నారు. అయితే ఇంతలోనే వెనిస్సా ప్రవర్తనలో తేడా వచ్చింది. ఆమె పోలీసుల వైపుకు ఒక్కసారిగా తుపాకీ ఎక్కుపెట్టడంతో ఆమెపై పోలీసులు కాల్పులు జరిపారు. అనంతరం గన్ చూడగా అది బొమ్మ తుపాకీ అని తెలిసింది.

  •  
  •  
  •  
  •  

Comments