లేటెస్ట్ అప్ డేట్స్ : ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ పక్కన మెరవనున్న హాలీవుడ్ భామ

Thursday, March 14th, 2019, 05:57:43 PM IST

ప్రస్తుతానికి తెలుగు చిత్ర సీమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్… దర్శకధీరుడు రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కించే చిత్రం కావడంతో ఈ చిత్రానికి అంచనాలు పెరిగిపోతున్నాయి. అంతే కాకుండా తెలుగులో భారీ మల్టీస్టారర్ గా, తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకు పోతున్న స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి ఈ చిత్రంలో నటిస్తున్నారు.

కాగా నేడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ చిత్రానికి సంబందించిన కొన్ని కీలక అంశాలను వెల్లడించారు దర్శకుడు రాజమౌళి. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కొమరం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్.టీ.ఆర్ నటించబోతున్నట్టు ప్రకటించారు రాజమౌళి. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గర్ జోన్స్ అనే హాలీవుడ్ భామ నటించనున్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్ కనిపించనున్నారు. కాగా ఈ చిత్రాన్ని 2020 జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాత దానయ్య తెలిపారు.