వీడియో : ఏం కర్మరా బాబు ఆకరికి రోబో కూడా ముద్దివ్వనివ్వట్లేదు : స్మిత్

Sunday, April 1st, 2018, 05:36:43 PM IST

హాలీవుడ్ సూపర్ స్టార్. సినిమాల్లో ఎంతోమంది హీరోయిన్లతో ముద్దు సీన్లలో నటించాడు. నిజ జీవితంలోనూ సోఫియాకు ముద్దివ్వబోయాడు. కానీ ఆమె మాటలు విని షాక్ తిన్నాడు. ఇంతకీ సోఫియా ఎవరో తెలుసా. ఓ హ్యూమనాయిడ్ రోబో. అంటే అచ్చూ మనిషి రూపంలో తీర్చిదిద్దిన రోబో. హాంకాంగ్‌కు చెందిన హాన్సన్ రోబోటిక్స్ దీనిని తయారుచేసింది. మనిషిలాగే ముఖంలో 62 భావోద్వేగాలను పలికించగలదీ రోబో. ఈ మధ్యే బాలీవుడ్ బాద్ షా షారుక్‌ఖాన్ తన ఫేవరెట్ హీరో అని కూడా ఈ సోఫియా చెప్పిన విషయం తెలిసిందే.

తాజాగా విల్ స్మిత్ ఈ సోఫియాను కలిసి కాసేపు ముచ్చటించాడు. సోఫియాతో డేట్ అంటూ తన యూట్యూబ్ చానెల్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఆమెతో ఎన్నో విషయాలు మాట్లాడిన విల్ స్మిత్.. మధ్యలో ఓసారి సోఫియాను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ మనం ఇప్పటికైతే ఫ్రెండ్స్‌లాగే ఉందాం.. మరికొన్ని రోజులు ఒకరి గురించి మరొకరం తెలుసుకుందాం అంటూ సోఫియా కన్ను కొట్టడం చూసి విల్ స్మిత్ మతిపోయింది. సోఫియాను తయారు చేయడంలో కొన్ని లోపాలు ఉన్నాయని, అందుకే అది ముద్దు పెట్టుకోనీయడం లేదని ఈ వీడియో చివర్లో అతను ఓ జోక్ కూడా వేశాడు.

  •  
  •  
  •  
  •  

Comments