లొంగిపోయిన నిర్మాత హార్వీ వీన్‌స్టీన్‌.. 80 మంది అమ్మాయిలతో..

Saturday, May 26th, 2018, 10:28:22 AM IST

ఎప్పుడు లేని విధంగా హాలీవుడ్ లో గత ఏడాది బడా నిర్మాతపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ ప్రొడ్యూసర్ హార్వీ వీన్‌స్టీన్‌ అమ్మాయిలపై పైశాచికంగా దాడి చేసినట్లు కూడా అనేక వార్తలు వచ్చాయి. గత ఏడాది ఎంతో ,మంది సీనియర్ నటీమణులు హార్వీ వీన్‌స్టీన్‌ అకృత్యాలను బయటపెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఆ వార్త సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అదే విధంగా మీటు అని సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ద్వారా మరింత వైరల్ అయ్యింది.

ఇండియాలో కూడా పలువురు హీరోయిన్స్ వేధింపులకు గురైనట్లు చెప్పారు. అసలు మ్యాటర్ లోకి వస్తే హార్వీ వీన్‌స్టీన్‌ శుక్రవారం న్యూ యార్క్ పోలీసులకు లొంగిపోయాడు. గతంలో తనపై వచ్చిన వార్తలు అవాస్తవమని చెప్పిన హార్వీ వీన్‌స్టీన్‌ ఇప్పుడు పోలీసుల ఎదుట లొంగిపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఏంజెలినా జోలీ – సల్మా హయక్ తో పాటు దాదాపు 80 మందికిపైగా నిర్మాత వీన్‌స్టీన్‌ అకృత్యాల గురించి చెప్పారు. ఇక కోర్టుకు హాజరైన ఆ నిర్మాతకు న్యాయాధికారులు రూ.6.7 కోట్ల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments