విశాఖ ఎయిర్పోర్ట్ ఘటన పై హోమ్ మంత్రి నిర్లక్ష్య వైఖరి

Thursday, October 25th, 2018, 04:55:22 PM IST

వైస్సార్సీపీ అధినేత వైస్ జగన్ పై వైజాగ్ ఎయిర్పోర్ట్ లో జరిగిన దాడి అభిమానుల్లో కలకలం రేపింది, మరో వైపు ఇది హత్యాయత్నమేమో అన్న అనుమానాలు ఉన్నాయి. పోలీస్ లు ముద్దాయి ని అదుపులోకి తీస్కొని విచారణ ప్రారంభించారు. ఈ ఘటన పై హోమ్ మంత్రి ప్రెస్ మీట్ లో మాటాడుతూ నిర్లక్ష్య వ్యాఖ్యలు చేసారు. ఒక వైపు ఈ దాడిని ఖండిస్తున్నాం అంటూనే, ఇంట్రాగేషన్ జరుగుతున్నది అంటూనే, ఇలాంటి దాడులకు ఎప్పుడూ అవకాశం ఉంటుందని, జగన్ జాగ్రత్తగా ఉండాల్సింది అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు జగన్ అభిమానులను ఆగ్రహానికి గురి చేసాయి. పది నిమిషాల పాటు జరిగిన విలేఖర్ల సమావేశం లో కనీసం ఒక్క మాట కూడా భద్రతా వైఫల్యం అని మంత్రి ఒప్పుకోకపోవటం గమనార్హం.

  •  
  •  
  •  
  •  

Comments