కొత్త సంవత్సరం మైండ్ బ్లోయింగ్ మొబైల్.. గెట్ రెడీ..!

Tuesday, January 16th, 2018, 07:13:58 PM IST

పలానా స్మార్ట్ ఫోన్ అద్భుతంగా ఉంది అని భావించే లోపు మార్కెట్ లోని మరో కొత్త ప్రోడక్ట్ వచ్చి ఊరించేయడం ఇప్పట్లో సాధారణంగా మారిపోయింది. స్మార్ట్ ఫోన్ లలో మీడియం రేంజ్ ఉన్న మొబైల్ ఉత్పత్తులకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న షియోమీ ఫోన్లు ఎక్కువగా వినియోగ దారులని ఆకర్షిస్తున్నాయి. కాగా కొత్త ఏడాది భారత మార్కెట్ పై హువై సంస్థ కన్నేసింది. ఈ సంస్థకు చెందిన మొబైల్ ప్రోడక్ట్ హానర్ 9 లైట్ జనవరి 17 నుంచి భారత మార్కెట్ లోకి సందడి చేయనుంది.

మధ్య తరగతి వారికి అందుబాటు ధరలో నాలుగు కెమెరాలతో ఏ స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో జనవరి 17 నుంచి దీని అమ్మకాలు మొదలవుతాయి. హానర్ 9 లైట్ రెండు వేరియంట్లలో లభించనుంది. 3 జిబి ర్యామ్, 32 జిబి రోమ్ వేరియంట్ మొబైల్ ధర సుమారు 12 వేల వరకు ఉండవచ్చు. ఇక 4 జిబి ర్యామ్ 32 జిబి రోమ్ వేరియంట్ ధర 15 వేల వరకు ఉండవచ్చు. హానర్ నుంచి నాలుగు కెమెరాలు కలిగిన ఫోన్ రావడం ఇది రెండవ సారి. ఊరిస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ లు ఈ విధంగా ఉన్నాయి..

* 3జిబి, 4 జిబి ర్యామ్, 32 జిబి రోమ్

* ఫ్రంట్ కెమెరా 13 ఎంపీ మరియు 2 ఎంపీ

* రియర్ కెమెరా 13 ఎంపీ మరియు 2 ఎంపీ

* ఫుల్ హెచ్ డి డిస్ప్లే , 5.65 ఇంచెస్

* 3000 ఎం ఏ హెచ్ బ్యాటరీ, నిరంతరాయంగా 20 గంటలు 3జి లో మాట్లాడుకోవచ్చు.

* లేటెస్ట్ కిరిన్ 659 ఆక్టా కొర్ ప్రాసెసర్