నాలుగు కెమెరాల ఫోన్లు కూడా వచ్చేశాయి

Saturday, November 11th, 2017, 06:10:50 PM IST

టెక్నాలిజీ పెరుగుతున్న కొద్దీ మొబైల్ కంపెనీల మధ్య పోటీ కూడా చాలా పెరిగింది. వారానికి ఒక మోడల్ ని రిలీజ్ చేస్తూ.. వినియోగ దారులను చాలా ఆకర్షితున్నాయి. అంతే కాకుండా సామాన్యుడికి అందుబాటు ధరలో ఉండడంతో ఎక్కువగా సేల్ అవుతున్నాయి. అయితే మొన్నటి వరకు డ్యూయల్ కెమెరా ఫోన్ల హవా చాలా కొనసాగింది. ఇక నుంచి నాలుగు కెమెరాల ఫోన్లు కూడా మార్కెట్ లోకి రానున్నాయి. రీసెంట్ గా హువాయి కంపెనీ ఒక ఫోన్ ను కూడా రిలీజ్ చేసింది. హానర్‌ 9ఐ మోడల్ ధర రూ.17,999గా ఉంది. మూడు రంగులతో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. మొత్తంగా నాలుగు కెమరాలు కలిగి ఉన్న ఈ ఫోన్ ఒక సెల్ఫీ కెమెరా 13ఎంపీ తో ఉండగా మరో సెల్ఫీ కెమెరా 2 మెగా పిక్సెల్ సామర్ధ్యంతో ఉంది. ఇక రియర్‌ కెమెరాల విషయానికి వస్తే 16 ఎంపీ – 2 ఎంపీ సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇక హానర్‌ 9ఐ ఫీచర్స్‌ విషయానికి వస్తే: ఆండ్రాయిడ్‌ 7.0 నౌగట్‌, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ 256 జీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకునేందుకు అవకాశం ఉంది. ఇక బ్యాటరీ సామర్థ్యం 3340 ఎంఏహెచ్‌ కెపాసిటీని కలిగి ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments