కేవలం ఒక్క రూపాయికే లేటెస్ట్ హానర్ మొబైల్..!

Saturday, September 8th, 2018, 05:32:26 PM IST

హువావె కి సంబందించిన హానర్ భారత దేశం లో ఒక్క రూపాయికే వారి యొక్క సరికొత్త మోడల్ ఫోన్ ని ఫ్లాష్ సేల్ రూపం లో తీసుకురాబోతున్నారు. కాకపోతే వీరు అన్ని షాపింగ్ ఆప్స్ లేదా వెబ్ సైట్లలో తీసుకురారు, వారి యొక్క హానర్ వెబ్ సైట్ లో లేదా హానర్ స్టోర్ లో మాత్రమే సేల్ కి తీసుకురానున్నారు. వీరు ప్రతి వారం వారి బ్రాండ్ కి సంబందించిన ఏదొక ఫోన్ ని ఫ్లాష్ సేల్ కి తీసుకువస్తారు. అలాగే వచ్చే వారం కూడా వారు ఈ మధ్యే విడుదల అయ్యి సక్సెస్ అయ్యిన హానర్ 9N ను తీసుకు రాబోతున్నారు.

ఈ మొబైల్ యొక్క ప్రత్యేకతలు 5.8 అంగుళాల టచ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3 మరియు 4 గిగా బైట్ల ర్యాం 32 మరియు 64 గిగా బైట్ల అంతర్గత స్టోరేజ్ తో ఉన్నాయి. కాకపోతే వీరు (3&32) మోడల్ ని సేల్ కి తీసుకురానున్నారు. దీనికి వెనుక 13+2 మెగా పిక్సల్స్ కలిగిన రెండు కెమెరాలు, ముందు 16 మెగా పిక్సెల్ కెమెరా ఉంటాయి. దీనిలో హువావే వారి శక్తివంతమైన “కిరిన్ 659 ప్రాసెసర్” ను ఉపయోగించారు.

ఇందులో అన్నిటికన్నా బాగా ఆకర్షించే విషయాలు రెండు ఒకటి ఈ మొబైల్ దాదాపు డిస్ప్లే లో పైన నాట్చ్ 90% టచ్ ఉంటుంది. అంతే కాకుండా ఈ మొబైల్ వెనుక భాగం లో మిర్రర్ గ్లాస్(అద్దంలా) ఫినిషింగ్ ఇవ్వడం వాళ్ళ చూడ్డానికి మరింత ఇంపుగా ఉంటుంది. మీరు ఈ మొబైల్ ని సొంతం చేసుకోవాలి అంటే హానర్ స్టోర్ లేదా హానర్ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మీ డెలివెరి అడ్రసు అన్ని ఖచ్చితమైనవి ఇవ్వవలసి ఉంటుంది. ఈ మొబైల్ ని సెప్టెంబర్ 11 వ తేదీన ఉదయం 11 గంటల 45 నిమిషాలకు సేల్ కి తీస్కువస్తున్నారు, ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటి అంటే వీటిని చాలా తక్కువ, మొత్తం లో తీసుకువస్తారు క్షణాల్లో అయ్యిపోతుంటాయి. మీరు దాన్ని దక్కించుకోవాలి అనుకుంటే మీరు కూడా ఆ వెబ్ సైట్ లో కానీ హానర్ స్టోర్ లో కానీ రిజిస్టర్ అవ్వండి ఇంకెందుకు ఆలస్యం..!