వాడికి హృదయమే లేదా..మూడు రోజుల పసికందు కాలువిరిచేసిన వార్డ్ బాయ్..!

Wednesday, February 8th, 2017, 02:58:47 AM IST


పసిపిల్లలు ఏడుస్తుంటే హృదయమున్న ఎవరైనా ఓదార్చాలని చూస్తారు.పసిపిల్లలకు ఏసమస్య వచ్చినా వారు నోటితో చెప్పలేరు కాబట్టి ఏడవడం సహజం.కనీసం ఇది కూడా తెలియని ఓ వార్డ్ బాయ్ దారుణానికి తెగబడ్డాడు. ఏడుస్తూ విసిగిస్తోందని 3 రోజుల పసిపాప పై అత్యంత దారుణ ఘటనకు పాల్పడ్డాడు. కోపంతో మూడు రోజుల పసికందు కాలు విరిచేసాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని రూర్కీ లో ఓ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. అతడి కర్కశత్వం ఆసుపత్రిలోని సిసి కెమెరాల్లో బయటపడింది.

శ్వాస సంబంధమైన సమస్యలతో భాదపడుతున్న మూడు రోజుల పసిపాపని ఆసుపత్రిలో చేర్పించగా డాక్టర్లు పరిశీలనలో ఉంచారు. ఆ ఆసుపత్రిలో వార్డ్ బాయ్ గా పనిచేస్తున్న వ్యక్తి అదేగదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ సమయం లో పాప ఏడవడం ప్రారంభించింది.పసిపాప అని కనికరం కూడా లేకుండా ఏడుపుతో విసిగిస్తోందని కాలు విరిచేసాడు. డైపర్ని మార్చే క్రమంలో పాప కాలిని మెలేసాడు. దీనితో పాప కాలు విరిగింది.కాలు విరిగిన నొప్పితో ఎక్కువగా ఏడవడం ప్రారంభించింది. డాక్టర్లు వచ్చి చూడగా పాప కాలు విరగడాన్ని గమనించారు. సిసి కెమెరాల్లో చూస్తే అది వార్డ్ బాయ్ పని అని తేలింది. దీనితో అతడిపై పోలీస్ కేసు నమోదు చేశారు.