ఐపీఎల్ ఫైనల్ : కోల్ కతా vs చెన్నై.. అదేంటి?

Thursday, May 24th, 2018, 03:30:06 PM IST

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణించి మొదట ప్లే ఆఫ్ కు చేరుకున్న జట్లు చెన్నై – హైదరాబాద్. ఇరు జట్లు బలంగా ఉన్నాయి కాబట్టి ట్రోపిని ఎవరు గెలుచుకుంటారు అనేది మొదట్లో సందేహంగా ఉండేది. అయితే హైదాబార్ జట్టును క్వాలిఫైర్ 1 లో ఓడించి చెన్నై ఫైనల్ కు వెళ్లింది. అయితే ఇప్పుడు కోల్ కత్తా చెన్నై ఫైనల్ మ్యాచ్ లో తలపడటానికి సిద్ధంగా ఉన్నట్లు హాట్ స్టార్ వాళ్లు ఒక వీడియోను విడుదల చేశారు. అదేంటి ఇంకా హైదరాబాద్ కు మరో అవకాశం ఉంది కదా.. అప్పుడే ఫైనల్ జట్లను ఎలా డిసైడ్ చేస్తారు అని హైదరాబాద్ అభిమానులు మండిపడ్డారు.

ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ తో నెగ్గిన కేకేఆర్ కచ్చితంగా హైదరాబాద్ తో క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో గెలవాలి. అప్పుడే జట్టు చెన్నైతో ఆడుతుంది. కానీ హైదరాబాద్ తో కేకేఆర్ ఇంకా తలపడకముందే హాట్ స్టార్ లో ఫైనల్ జట్లు అని చెన్నై – కేకేర్ విజువల్స్ చూపించడంపై అనుమానాలు కలుగుతున్నాయి. ఈ విధంగా చూపిస్తే ఫిక్సింగ్ అని అర్దమైపోతుందని చాలా మంది అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది రేపటి మ్యాచ్ తో తేలుతుందని మరికొందరు చెబుతున్నారు. రేపు హైదరాబాద్ – కోల్ కత్తా మధ్య 7 గంటలకు ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ జరగనుంది.