పెళ్లంటే కాజ‌ల్ లో ఎందుకీ డైలెమా?

Monday, February 11th, 2019, 12:20:50 PM IST

లైఫ్‌లో పెళ్లి ప్రాధాన్య‌త తెలిసిందే. అయితే అంత ఇంపార్టెంట్ విష‌యాన్ని కొంద‌రు అగ్ర క‌థానాయిక‌లు లైట్ తీస్కోవ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ముఖ్యంగా అందాల చంద‌మామ కాజ‌ల్ పెళ్లంటేనే విర‌క్తిగా ఉండ‌డం ప్ర‌తిసారీ యూత్ లో చ‌ర్చ‌కు తావిస్తోంది. మ‌రోసారి పెళ్లి పై కాజ‌ల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. అస‌లు పెళ్లి చేసుకునే ఆలోచ‌నే లేదు. ఒక‌వేళ చేసుకున్నా ఇండ‌స్ట్రీ వ్య‌క్తిని మాత్రం పెళ్లాడ‌న‌ని కాజ‌ల్ ఖరాకండిగా చెప్పేసింది.

అయితే పెళ్లి మాటేమో కానీ, ఇండ‌స్ట్రీ వ్య‌క్తిని పెళ్లాడ‌న‌ని కాజ‌ల్ చేసిన వ్యాఖ్య పెను దుమారం రేపుతోంది. కాజ‌ల్ వ్యాఖ్య‌ల‌పై ప్ర‌స్తుతం నెటిజ‌నులు ఆస‌క్తిక‌రంగా రిప్ల‌య్ ఇస్తున్నారు. సినిమా వాళ్లంటే కాజ‌ల్ కి అంత చుల‌క‌నా? ప‌రిశ్ర‌మ‌లో ఉండి ప‌రిశ్ర‌మ వ్య‌క్తిని చేసుకోన‌ని ఎలా చెబుతోంది? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. అయితే పెళ్లి విష‌యంలో ఎవ‌రి వాద‌న వారికి ఉంటుంది. వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌ను కాద‌ని అన‌లేం. బ‌హుశా కాజ‌ల్ మ‌రీ అంత వెక్స్ అయిపోయి మాట్లాడ‌డానికి స‌హేతుక కార‌ణం లేక‌పోలేదు. కాజ‌ల్ కెరీర్ పీక్స్ లో ఉండ‌గానే ఇండ‌స్ట్రీకి చెందిన ఒక అగ్ర క‌థానాయ‌కుడిని ప్రేమించింద‌ని వార్త‌లొచ్చాయి. ఆ సంగ‌తిని కాజ‌ల్ ప‌లుమార్లు ఇంట‌ర్వ్యూల్లోనూ బ‌హిరంగంగానే అంగీక‌రించింది. ప్రేమ‌లో విఫ‌ల‌మ‌య్యాను. ఒక‌సారి ప్రేమించి ఓడిపోయాను కాబ‌ట్టి ఇక పెళ్లి ఆలోచ‌నే లేద‌ని చెప్పింది. ఆ క్ర‌మంలోనే త‌ను స్వ‌చ్ఛంద సేవ‌లు చేస్తూ బిజీ అయిపోయింది. ప్ర‌స్తుతం కాజ‌ల్ కొంద‌రిని ద‌త్త‌త తీసుకుని వారి బాగోగులు చూసేందుకే ఆస‌క్తి చూపిస్తోంది. ఇటీవ‌లే ఏపీలోని అర‌కు వ్యాలీలో ఓ గిరిజ‌న పాఠ‌శాల ప్రారంభించి అక్క‌డ పిల్ల‌ల‌కు విద్యాబుద్ధులు నేర్పిస్తోంది. త‌న‌కు ఇష్ట‌మైన వ్యాప‌కాలు చూసుకుంటూ పెళ్లికి పూర్తిగా దూరంగా ఉంటోంది కాజ‌ల్. ఇక ఆస‌క్తిక‌రంగా కాజల్ ప్రేమించిన స‌ద‌రు స్టార్ హీరో సైతం పెళ్లంటే దూరంగానే ఉంటున్నార‌న్న ఆస‌క్తిక‌ర ముచ్చ‌టా టాలీవుడ్ లో వేడెక్కిస్తోంది.