బాబుపై దాడులు జ‌న‌సేనానికి అలా ప్ల‌స్!?

Saturday, October 13th, 2018, 10:23:32 AM IST

ప్ర‌త‌ర్థి ఆర్థిక బ‌లాన్ని నాశ‌నం చేస్తేనే గెలుపు సాధ్యం! ఇదీ యుద్ధ‌నిర‌తి. మ‌హాభార‌తం అయినా, రామాయ‌ణం అయినా అవ‌త‌లివాళ్ల బ‌లం, బ‌ల‌గం ఏంటో తెలుసుకుని దానిని నిర్వీర్వం చేయాల‌న్న నీతిని బోధించాయి పురాణాలు. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో ఈ వ్యూహాన్నే అనుస‌రిస్తున్నారు. ఇప్ప‌టికే ఏపీ, తెలంగాణ‌లో ఆప‌రేష‌న్ స్టార్ట్ చేసిన మోదీ త‌న ప‌ని తాను స‌వ్యంగానే చేస్తున్నాడు. అవినీతి ప‌రుల గుండెల్లో రైళ్లు ప‌రుగులెట్టిస్తూ, త‌న పార్టీ భాజ‌పా గెలుపున‌కు మార్గం సుగ‌మం చేసుకోవాల‌ని మోదీ క‌ల‌ల‌గంటున్నాడు. ఈ ప‌రిణామం ఓ ఇద్ద‌రికి పెద్ద రేంజులోనే క‌లిసి రానుంది. ఆ ఇద్ద‌రూ ఎవ‌రు? అంటే వైయ‌స్ జ‌గ‌న్, ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఒక‌రు వైకాపా అధినేత‌, మ‌రొక‌రు జ‌న‌సేనాని. ఆ ఇద్ద‌రిలో టాస్ వేస్తే జ‌న‌సేనానికే అంతా అనుకూలం.

2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుపై నెగ్గ‌డ‌మే ధ్యేయంగా వైయ‌స్సార్ పార్టీ నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్ పావులు క‌దుపుతున్నారు. అయితే ఆయ‌న పావులు క‌ద‌ప‌డం వెన‌క రాజ్యాధికారం చేతికి చిక్కించుకోవ‌డ‌మే ప్ర‌ధాన అజెండా. తద్వారా త‌న ఆస్తుల్ని ప‌రిర‌క్షించుకోవ‌డం, విదేశాల్లో అక్ర‌మంగా దాచుకున్న సొమ్ముల్ని కాపాడుకోవ‌డం.. షెల్ కంపెనీల గుట్టు బ‌య‌ట‌కు ఏదీ లీక‌వ్వ‌కుండా త‌న ప‌ని తాను చేసుకోవ‌డం. అయితే ఈ నిజం తెలిసిన ఏపీ ప్ర‌జ‌లు క‌చ్ఛితంగా జ‌గ‌న్‌కి ఓటేస్తారా? అంటే సందేహ‌మే. ఎలానూ అధికారంలో ఉండి దోచుకుంటున్న చంద్ర‌బాబు గురించి అంతా తెలిసిపోయింది. ప్ర‌స్తుతం బాబు & బినామీల అక్ర‌మాస్తుల చిట్టాల్ని మోదీ ప్ర‌భుత్వం బ‌య‌ట‌పెట్టేస్తోంది కాబ‌ట్టి, వీళ్ల‌ను కోటానుకోట్ల ప్ర‌జ‌లు యావ‌గించుకోవ‌డం ఖాయ‌మైన‌ట్టే.

ఈ ప‌రిణామం నేప‌థ్యంలో ఏపీలో ఉన్న ఏకైక ఆల్ట‌ర్నేట్ ఆప్ష‌న్ జ‌న‌సేనాని మాత్ర‌మే. ఇప్ప‌టివ‌ర‌కూ ఆస్తులు కూడ‌బెట్టుకోవ‌డం, దోపిడీలు సాగించ‌డం, దుర్మార్గ రాజ‌కీయాల‌కు తెగ‌బ‌డ‌డం వంటి అల‌వాట్లేవీ జ‌న‌సేనానికి లేవు. అత‌డికి ఆ అవ‌కాశ‌మే లేదు. పైగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌ల్లో నిజాయితీ జ‌నాల‌కు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఆ క్ర‌మంలోనే పాద‌యాత్ర‌లతో, బ‌స్సు యాత్ర‌ల‌తో జ‌నాల్లోకి వెళుతూ అంద‌రినీ క‌లుస్తున్నాడు జ‌న‌సేనాని. పైగా ఎన్న‌డూ లేనంత‌గా ఏపీలో ఉన్న 5కోట్ల మంది కాపులు ఈసారి ఎట్టి ప‌రిస్థితిలో త‌మ వ‌ర్గ నాయ‌కుడే సీఎం కావాల‌న్న పంతంతోనూ ఉన్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు స‌హా అన్ని కీల‌క వ్య‌వ‌హారాల్లోనూ కాపుల వెన‌క‌బాటు పెను ఉప్పెన‌లా దూసుకు రానుంది. ఈ నేప‌థ్యంలో 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేనానికి ముద్ర‌గ‌డ, చిరంజీవి వంటి నాయ‌కులు అండ‌గా నిలిచే స‌న్నివేశం క‌నిపిస్తోంది. మ‌రోవైపు ఉత్త‌రాంధ్ర‌లో బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, గంటా శ్రీ‌నివాస‌రావు వంటి వాళ్లు ప్ర‌స్తుతం ఉన్న పార్టీల్లో ఉంటారా? అన్న‌ది సందేహ‌మేన‌న్న మాటా వినిపిస్తోంది. నిన్న‌గాక మొన్న కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ స్పీకర్ నాదెండ్ల జ‌న‌సేన‌లోకి చేర‌డంతో కొత్త ఊపు వ‌చ్చింది. ఈ ప‌రిణామాల‌న్నీ జ‌న‌సేనానికి కలిసొచ్చేట్టే క‌నిపిస్తోంది. క‌నీసం కింగ్ కాలేక‌పోయినా, 2019 ఎన్నిక‌ల్లో కింగ్ మేక‌ర్ కావ‌డం మాత్రం ఖాయ‌మ‌ని లెక్క తేలుతోంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ప‌వ‌న్ పెంచుకుంటున్న బ‌లం, బ‌ల‌గం చూస్తుంటే ఇది ఖాయ‌మేన‌ని అంచ‌నా వేస్తున్నారు.