బ్యాంకు సమ్మెతో ఎన్ని కోట్ల లావాదేవీలు స్తంభించాయో తెలుసా?

Thursday, May 31st, 2018, 04:09:27 PM IST

2012తో పోలిస్తే ఇటీవల చేపట్టిన అతి తక్కువ వేతన సవరణకు నిరసనగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన రెండురోజుల దేశవ్యాప్త సమ్మె ఫలితంగా దాదాపు రూ. 20,000 వేల కోట్ల మేర కార్యకలాపాలు స్తంభించినట్లు సమాచారం. ప్రభుత్వరంగ బ్యాంకులు, అలానే కొన్ని ప్రైవేట్, గ్రామీణ బ్యాంకులు చేపట్టిన ఈ సమ్మెలో మొత్తంగా 10లక్షల మంది ఉద్యోగులు పాల్గొన్నారని తెలుస్తోంది. కాగా తాము చేపట్టిన ఈ రెండురోజుల సమ్మెలో తొలిరోజున వంద శాతం మేర లావాదేవీలు నిలుపుదల చేశామని, అంతేకాక రెండవ రోజైన నేడుకూడా ఉద్యోగులు సమ్మెను విజయవంతం చేస్తున్నారని మహారాష్ట్ర యునైటెడ్ ఫోరమ్ ఫర్ బ్యాంకు యూనియన్ అధ్యక్షులు దేవిదాస్ తుల్జాపుర్కర్ అన్నారు.

వాస్తవానికి నిన్న మధ్యాహ్నం వరకు ఏటీఎమ్ సర్వీసులుకూడా చాలా చోట్ల మూతపడ్డాయని, నేడు నెల చివరిరోజు కావడం రేపు ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాల రోజు కావడంతో ఈ సమ్మె ప్రభావం దానిపై గట్టిగానే పడనున్నట్లు తెలుస్తోంది. కాగా నిన్న సాయంత్రం నుండి చాలా చోట్ల ఏటీఎంలు పనిచేసినప్పటికీ వాటిల్లో వున్న కాస్త నగదు కూడా ఖాళీ అయిందని బ్యాంకు వర్గాలు చెపుతున్నాయి. బ్యాంకులు లాభాల బాట పట్టకపోవడానికి కారణమ్ ఉద్యోగులు కాదని, ప్రొవిజన్స్ ఎక్కువగా పెరగడంతో బ్యాంకులు తీవ్ర నష్టాలూ చవిచూస్తున్న విషయం ప్రభుత్వం గ్రహించాలని అన్నారు. తాము చేపట్టిన ఈ రెండురోజుల సమ్మె ఫలితంగా ఇకనైనా ప్రభుత్వం తమకు అనుకూలంగా వేతన సవరణ చేసి బ్యాంకు సిబ్బందికి, ఉద్యోగులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నట్లు ఆయన తెలిపారు…..