మూడు పార్టీల అధినేతల మెజార్టీపై సంచలన కథనం.!

Wednesday, May 22nd, 2019, 05:12:45 PM IST

ఎన్నికల ఫలితాలు వస్తున్నాయంటే కొన్ని కీలక నియోజకవర్గాలు ఎప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఆయా పార్టీలకు సంబంధించిన అభిమానులు కొంత మంది కీలక నేతల బలాబలాల పై అభిమానులు బెట్టింగులు కూడా కాస్తూ ఉంటారు.అయితే ఈసారి మాత్రం ఇవి మరింత జోరు అందుకున్నాయనే చెప్పాలి గతంలో అంటే రెండు పార్టీలకు సంబంధించి చంద్రబాబు మరియు జగన్ ల మధ్యనే ప్రధాన పోటీ కానీ ఈసారి మాత్రం రంగంలోకి మూడో పార్టీ అధినేత కూడా ఉన్నారు.దీనితో ఈ ముగ్గురి గెలుపు పైన ఏపీ ప్రజలు స్పెషల్ ఫోకస్ పెట్టారు.చంద్రబాబు,జగన్ మరియు పవన్ కళ్యాణ్ లు పోటీ చేస్తున్న నియోజకవర్గాల నుంచి ఎంత మెజార్టీతో గెలుస్తారు అన్నది చాలా కీలకంగా మారింది.ఓ సారి ఈ ముగ్గురి పైన చిన్న విశ్లేషణను గమనిద్దాం.

1) చంద్రబాబు నాయుడు

ప్రస్తుత పాలక పక్ష అధినేత ఈయన 40 ఏళ్ల అనుభవంలో దీనితో కలిపి 7వ ఎన్నికను చూసారు.అలాగే ఏడూ సార్లు పోటీ చేసారు.ఏ ఒక్కసారి కూడా ఈయన పోటీ చేసిన కుప్పం నియోజకవర్గం నుంచి ఓడిన దాఖలాలు లేని ట్రాక్ రికార్డు సొంతం చేసుకున్నారు.గడిచిన 2014 ఎన్నికల్లో చూసినట్లయితే వైసీపీ అభ్యర్థి చంద్రమౌళికి 55,839 ఓట్లు పడగా చంద్రబాబుకి ఏకంగా 1,02,952 ఓట్లు పడ్డాయి అంటే ఇక్కడ చంద్రబాబుకి 47,121 ఓట్ల ఆధిక్యత వచ్చింది.మరి ఈసారి ఈ సంఖ్య ఇంకా ఏమన్నా పెరుగుతుందో లేదో చూడాలి.

2) వై ఎస్ జగన్మోహన్ రెడ్డి

రాయల సీమ ప్రాంతం అంటే ఇక అది వైఎస్ కుటుంబానికి కంచుకోటగా భావిస్తారు.అలాగే కడపలో అందులోను జగన్ పోటీ చేసే పులివెందుల నియోజకవర్గంలో అయితే జగన్ ట్రాక్ రికార్డే వేరు అని చెప్పాలి.ఎమ్మెల్యే గా కాకుండా అక్కడ ఎంపీ అభ్యర్థిగా అయితే 5 లక్షల ఓట్ల మెజార్టీ ఇంకా చెక్కు చెదరని ఆల్ టైం రికార్డుగా ఉంది.ఇక జగన్ గత ఎన్నికల్లో 1,24,576 ఓట్లు దక్కించుకోగా టీడీపీ అభ్యర్థి 49,333 ఓట్లు సాధించారు.దీనితో ఇక్కడ జగన్ దెబ్బకు 75,243 భారీ మెజార్టీ సొంతం చేసుకున్నారు.మరి ఈసారి ఇంకెంత మెజార్టీ తెచ్చుకుంటారో చూడాలి.

3) కొణిదెల పవన్ కళ్యాణ్

ఇప్పుడు అందరి చూపు ఇతని వైపే మొట్టమొదటి సారిగా ఎన్నికల బరిలో పవన్ నిలుచున్నారు.విశాఖపట్నం జిల్లా గాజువాక మరియు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చేస్తున్నారు.దీనితో ఈ రెండు చోట్లా పవన్ గెలుపు ఖాయమని పవన్ అభిమానులు సహా విశ్లేషకులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.కానీ భీమవరంలో మాత్రం ఏం జరుగుతుందా అన్న ఒక ప్రశ్న ఇప్పటికీ ఎవరికీ అంతు చిక్కడం లేదు.గాజువాకలో అయితే పవన్ లక్ష మెజార్టీ కూడా దక్కించునే అవకాశం ఉందని అక్కడ శ్రేణులు చెప్తున్నారు.మరి భీమవరంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూడాలంటే అది ఫలితాల్లో తేలాల్సిందే.దీనితో పవన్ మెజార్టీ పై కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మరి ఈ ముగ్గురిలోను ఎవరి సత్తా ఎంతో తెలియాలంటే రేపు ఎన్నికల ఫలితాలు పూర్తయ్యే వరకు ఆగక తప్పదు.రేపు ఎన్నికల ఫలితాలు నిరంతరం లైవ్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే మా “తెలుగుఇన్” వెబ్ సైట్ ను చూస్తూ ఉండండి.