మార్కెట్ లోకి హెచ్.పీ రెండు ముక్కల ల్యాప్ టాప్…

Tuesday, April 10th, 2018, 04:14:17 PM IST

హెచ్‌పీ సంస్థ క్రోమ్‌బుక్ ఎక్స్2 పేరిట ప్రపంచంలోనే మొదటి 2 ఇన్ 1 డిటాచబుల్ క్రోమ్‌బుక్‌ను ఇవాళ విడుదల చేసింది. ఇందులో 12.3 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2400 x 1600 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఇంటెల్ 7వ జనరేషన్ కోర్ వై సిరీస్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 10 గంటల బ్యాటరీ బ్యాకప్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా తదితర ఫీచర్లు ఉన్నాయి.

హెచ్‌పీ క్రోమ్‌బుక్ ఎక్స్2 ను ల్యాప్‌టాప్ లేదా ట్యాబ్లెట్ పీసీ రెండు విధాలుగా వాడుకోవచ్చు. అందుకు గాను ఓ డిటాచబుల్ కీ బోర్డ్‌ను ఇందులో అందిస్తున్నారు. ఈ కీబోర్డును అల్యూమినియం ఫినిషింగ్‌తో రూపొందించారు. అందువల్ల దీనికి ప్రీమియం లుక్ వచ్చింది. ఇక ఈ క్రోమ్‌బుక్ ధర రూ.38,887గా ఉంది. దీన్ని హెచ్‌పీ ఆన్‌లైన్ స్టోర్ నుంచి కొనుగోలు చేయవచ్చు.