టీడీపీని ముంచుతున్న ఆ ఇద్దరు లీడర్లు!

Tuesday, February 12th, 2019, 09:03:22 AM IST


కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. అది కూడా సొంత పార్టీ నేతల మూలానే కావడం గమనార్హం. ఇద్దరు ముఖ్యమైన నేతల మధ్యన రాజుకున్న పోరు పార్టీ పరువుకే భంగం వాటిల్లుతోంది. గత ఎన్నికల్లో వైకాపా తరపున గెలిచిన ఎస్వీ మోహన్ రెడ్డి తరువాత టీడీపీలో చేరారు. ఈసారి కూడా ఆయన కర్నూల్ టికెట్ డిమాండ్ చేస్తున్నారు.

మరొక పెద్ద నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ తన కుమారుడికి కర్నూల్ టికెట్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రతిపాదనను చంద్రబాబు వద్దకు తీసుకెళ్ళి హామీ పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వీరి నడుమ విభేదాలు మొదలయ్యాయి. ఇన్నాళ్లు అంతర్గతంగా పోట్లాడుకున్న ఈ ఇద్దరూ ఇప్పుడు బహిరంగ సమావేశాల్లో తిట్టుకుంటున్నారు.

వీరి వ్యవహారం చూసిన ఇతర లీడర్లు ఇలానే ఉంటే గెలవడం సంగతి తర్వాత ఉన్న పరువు కూడా పోయే ప్రమాదముందని తలలు పట్టుకుంటున్నారు. ఎలాగైనా వీరిని ఒక చోటుకి చేర్చి సర్ది చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. మధ్యలో కోట్ల కుటుంబం కూడా ఇదే టికెట్ కోసం మంతనాలు జరుపుతుండటం కొత్త వివాదానికి తెర లేపుతోంది.