కోహ్లీకి భారీ జరిమానా!

Friday, April 27th, 2018, 01:20:05 AM IST

ప్రస్తుతం జరుగుతున్న ఐపిల్ 11వ సీజన్ బెంగళూరు జట్టుకు అసలు కలిసి రావడం లేదని చెప్పాలి. ఎంతో కష్టపడి భారీ స్థాయిలో 200 పరుగులు చేసినప్పటికీ అవతలి జట్టు దానిని ఛేదించడం వంటి వాటివల్ల వారికి అపజయాలు తప్పడంలేదు. ముఖ్యంగా నిన్న జరిగిన మ్యాచ్ లో ఒకానొక దశలో 70 పరుగులకే 4 వికెట్లను కోల్పోయిన చెన్నై జట్టు ఓటమిపాలు అయ్యే అవకాశాలు చాలావరకు కనిపించినప్పటికీ, రాయుడు, ధోనిల అద్భుత బాటింగ్ తో ఆ జట్టు అద్భుత విజయం సాధించింది.

అయితే నిన్నటి మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆర్ సి బి జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కి రూ. 12 లక్షల జరిమానా విధించింది ఐపిల్ టీం మేనేజ్మెంట్. ఈ విషయమై ఒకలేఖ కూడా విడుదల చేసింది. కాగా ఇలా స్లో ఓవర్ రట్ కారణంగా ఫైన్ విధించడం ఇదే తొలిసారి అని కూడా తెలిపింది. ఇప్పటివరకు మొత్తం ఆరు మ్యాచ్ లు ఆడిన బెంగళూరు జట్టు, కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే గెలిచి, పాయింట్ల పట్టికలో ఆరవ స్థానంలో నిలిచింది. కాగా బెంగళూరు జట్టు ఈ నెల 29న కోల్కత్తా జట్టుతో తలపడనుంది…..

  •  
  •  
  •  
  •  

Comments