జగన్ కోసం వచ్చిన జనసముద్రం.. చంద్రబాబు చూస్తే షాకే!

Monday, September 10th, 2018, 01:28:55 PM IST

చంద్రబాబు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. అయితే జగన్ మాత్రం ఏపిలో తన యాత్రలను మాత్రం తగ్గించడం లేదు. ఇక రీసెంట్ గా విశాఖలోని కంచరపాలెంలో వైసీపీ నిర్వహించిన బహిరంగ సభకు ఎవరు ఊహించని విధమైన ఆధారన దక్కింది. అందుకు సంబందించిన పోటోలను గనక చంద్రబాబు చుస్తే షాక్ అవ్వాల్సిందే అంటున్నారు నెటిజన్స్. ఉత్తరాంధ్రలో వైఎస్ కు మంచి ఆదరణ ఉంది. ఇప్పటివరకు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్ నిర్వహించిన బహిరంగ సభలు ఒక ఎత్తైతే కంచరపాలెంలో నిర్వహించిన సభ మరొక ఎత్తు.

ఈ జన సముద్రంతో జగన్ కు పెరుగుతున్న ఆదరణ ఏమిటో అర్థమవుతోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. నలుదిక్కులూ జనంతో ఆ ప్రాంత పరిసరాలు కిక్కిరిశాయి. ఇసుక వేస్తె రాలనంత జనం అక్కడ దర్శనమిచ్చారు. చుట్టూ ప్రక్కల గ్రామాల నుంచి చాలా మంది జనాలు నడిచి వచ్చినట్లు వైసీపీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక సమీపాన ఉన్న తాటిచెట్ల పాలెం రోడ్డుపై రెండు కిలోమీటర్ల వరకు వాహనాలకు దారి దొరకలేదు. రాకపోకలు స్తంభించాయి. ఇక మరోవైపున్న జ్ఞానాపురం దారిలో జనసమూహం ధాటికి అడుగు వేయడం కూడా కుదరలేదు. మొత్తానికి జగన్ విశాఖలో తన బలాన్ని మరింత పెంచుకున్నాడని జనంతో అధికార పక్షానికి సమాధానం చెప్పాడు.

  •  
  •  
  •  
  •  

Comments