పుట్టిన రోజు నాడే..గర్భవతి అయిన భార్యని, కూతుర్ని కాటికి పంపబోయి..!!

Thursday, February 9th, 2017, 11:59:13 AM IST


తిరుపతిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది.నిండు గర్భిణి అయిన భార్య పుట్టిన రోజునాడే ఆమెని, మూడేళ్ల తన కూతుర్ని హత్య చేయడానికి ప్రయత్నించి చివరకు తానే మరణించాడు. ఈ ఘటన తిరుపతిలో స్థానికంగా అబ్బన్న కాలనీలో చోటుచేసుకుంది. పోలీస్ వారి కథనాల ప్రకారం భార్య కూతుర్ని హత్య చేయడానికి ప్రయతించిన భర్త చివరకు తనుకూడా ఆత్మహత్య చేసుకుని మరణించాడు. స్వాతికుమార్ (28), మహాలక్ష్మి (23) లు 2011 లో వివాహం చేసుకున్నారు. స్వాతికుమార్ తిరుపతిలోని ఓ ప్రైవేట్ సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. బుధవారం రోజు మహాలక్ష్మి పుట్టినరోజు. దీనితో ఆమె తల్లిదండ్రులు మహాలక్ష్మికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆరోజే మహాలక్ష్మి తల్లి శ్యామల చెన్నై నుంచి తిరుపతికి కూతురువద్దకు బయలుదేరింది.

ఆ రోజు ఉదయం స్వాతికుమార్ తన కూతురిని స్కూల్ లో వదలిపెట్టివచ్చాడు.మధ్యాహ్నం భోజనం కోసం పాప ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకునివచ్చాడు. మధ్యాహ్నం 1:30 గంటలప్రాంతం లో ఏంజరిగిందో తెలియదు కానీ భ్యార్య బిడ్డల్ని హత్య చేసేందుకు స్వాతికుమార్ నిర్ణయించుకున్నాడు. వంటగదిలో ఉన్న మహాలక్ష్మిని తొమ్మిదినెలల నిండు గర్భవతి అని కూడా చూడకుండా కడుపులో పొడిచాడు. అనంతరం మూడేళ్ళ పసిపాప అయిన తన కూతురిపై కూడా కత్తితో దాడి చేశాడు.రక్తపు స్రావంతో భాదపడుతూ మహాలక్ష్మి మేడ మీది నుంచి కిందికి దిగడానికి ప్రయత్నించింది. వారి ఇంటి సమీపంలోనే ఆసుపత్రి నిర్వహిస్తున్న రామకృష్ణ మహాలక్ష్మిని, ఆమె కూతుర్ని ఆసుపత్రిలో చేర్పించాడు. వారిద్దరూ చనిపోతారని నిర్ణయించుకున్న స్వాతికుమార్ కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వైద్యులు సకాలంలో స్పందించడంతో మహాలక్ష్మి, తనకూతురు ఇద్దరూ ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడ్డారు. కానీ మహాలక్ష్మి గర్భం లోని శిశువు మాత్రం మరణించింది. తన భర్త మంచివాడని ఇలా ఎందుకు చేయాల్సివచ్చిందో తెలియదని చెప్పింది. తమ మధ్య గొడవలు లేవని కూడా తెలిపింది.