భార్య ఇల్లీగల్ ఎఫైర్ : రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త..!

Monday, August 6th, 2018, 07:11:46 PM IST

గత కొంతకాలంగా మన దేశంలో ఆడ, మగ తేడాలేకుండా కొందరు విచక్షణ జ్ఞానాన్ని మరిచి అక్రమ సంబంధాల మోజులో పడి తమ జీవిత భాగస్వాములతో కలిసిబ్రతికే నూరేళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. అయితే ఇటువంటి చర్యలు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అవగాహనా లోపం, ఒకరినొకరు సరిగా అర్ధంచేసుకోకపోవడం వల్లనే జరుగుతున్నాయని మానసిక నిపుణులు అంటున్నారు. ఇక ప్రస్తుతం ఎన్నాళ్ళనుండో వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న తన భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు ఒక భర్త. వివరాల్లోకి వెళితే, కోదాడ పట్టణం హుజూర్ నగర్ మండలం, బూరుగుగడ్డ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు సూర్యాపేటలో ఆర్ముడ్ రిజర్వు కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఇక వరంగల్ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కొండల్ రావుకు 2016లో బూరుగు గడ్డకు చెందిన మహిళతో వివాహం జరిగింది. అయితే పూర్వమే కొండల్ రావు భార్యకు వెంకటేశ్వర్లుతో వివాహేతర సంబంధం వుంది.

ఈ విషయం కొండల్ రావు దృష్టికి రావడంతో భార్యను పలుమార్లు అతడు మందలించాడు. అంతటితో ఆగకుండా ఈ విషయమై పెద్ద పంచాయితీ కూడా జరిగిందట. అయినప్పటికీ ఒకరోజు కొండల్ రావు తన భార్య ఫోన్ చెక్ చేయగా, అందులోని వాయిస్ రికార్డర్ లో వెంకటేశ్వర్లు తో అతని భార్య మాట్లాడిన మాటలు వినిపించాయి. ఆ మాటల్లో ఎప్పుడు వెంకటేశ్వర్లు తన ఇంటికి వస్తోంది, వెళ్తోంది తెలియడంతో, ఆ సమయాన్ని గుర్తుపెట్టుకున్న కొండల్ రావు, ఒకరోజు తాను పనిమీద బయటకు వెళ్తున్నానని, కొన్ని గంటలవరకు తిరిగిరానని చెప్పి బయటకు వెళ్ళినట్లే వెళ్లి ఇంటి బయట ప్రాంతంలో ఎవరికి కనపడకుండా దాక్కున్నాడు. అదే అదనుగా వెంకటేశ్వర్లుకు ఫోన్ చేసి పిలిపించింది కొండల్ రావు భార్య. ఇక ఇదే అవకాశం అనుకుని, వెంకటేశ్వర్లు తన ఇంట్లోకి వెళ్లీవెళ్లగానే ఇంటికి బయట గొళ్ళెం పెట్టాడు కొండల్ రావు. అంతే ఇంటి చుట్టుప్రక్కలి వారిని, పోలీస్ లను తన ఇంటికి రప్పించి తన భార్య రెడ్ హ్యాండెడ్ గా వెంకటేశ్వర్లుతో ఉండడాన్ని పట్టించాడు. పోలీస్ లు వెంకటేశ్వర్లును, కొండల్ రావు భార్యను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్ట్ కు తరలించినట్లు తెలిపారు. కాగా ఈ ఘటన బూరుగుగడ్డ ప్రాంతం వాసుల్లో తీవ్ర కలకలాన్ని రేపింది…..

  •  
  •  
  •  
  •  

Comments