బ్రేకింగ్ వీడియో : కన్నీరు కారుస్తూ భార్యను భుజాలపై మోసుకేళ్లాడు…

Tuesday, May 8th, 2018, 12:05:59 PM IST

ఓ వైపు ప్రజలకి ఆరోగ్య సమస్య వచ్చినా, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాకూడా ప్రభుత్వ ఆసుపత్రినే సంపాదించాలని అధికారులు చెప్తున్నా కూడా మరో వైపు అదే ప్రభుత్వ ఆసుపత్రి సామాన్య ప్రజలను పట్టించుకోవడం కూడా లేదు. ఇటివల ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో ఓ ఆసుపత్రి సిబ్బంది మానవత్వం మరిచి ప్రవర్తించారు. వచ్చిన బాదితున్ని పట్టించుకోవడం మానేసి దురుసుగా ప్రవర్తించారు. కనీసం చేయవలిసిన ప్రథమ చికిత్స కూడా చేయలేదు. సామాన్య మానవునికి అందించావలిసిన కనీస సేవలు కూడా అందించలేదు ఆ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది. చివరకు ప్రాణం కోల్పోయిన అతని భార్య శవాన్ని ఓ భర్త భుజాలపై మోసుకెళ్లాడు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ను ఇవ్వలేదని బాధితుడు వాపోయాడు. ప్రాణాపాయ స్థితిలో వస్తే బతికించాల్సింది పోయి ఇలా దురుసుగా ప్రవర్తించి ప్రాణం పోయిన చేసిన వారిపై కేసు పెడతానన్నాడు మృతురాలి భర్త. విషయం తెలుసుకున్న ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Comments