భార్య తప్పిపోయిందని భర్త కంప్లైంట్…..ఇంతకీ ఏమైందంటే!

Tuesday, April 24th, 2018, 01:10:31 AM IST


భార్య భర్తలంటే ఒకరికి ఒకరుగా, ఒకరికోసం మరొకరుగా బ్రతకాలి అనేది పాత సామెత. కానీ నేడు భార్యాభర్తలు ఒకరి సమస్యలపై ఒకరు వేలెత్తి చూపడం ఒకవేళ నచ్చకపోతే విడాకులు, మరీ కుదరకపోతే వారిని అంతమొందించడం కొందరికి అలవాటుగా మారింది. అయితే ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన అక్కడివారిని భయబ్రాంతులకు గురి చేసింది. విషయం లోకి వెళితే గత ఏడాది ఫిబ్రవరి లో ఇన్కమ్ టాక్స్ ఉద్యోగి ఉమేష్ తో మునీష్ అనే యువతికి పెళ్లి జరిగింది. ఇద్దరు సంవత్సర కాలంగా హాయిగా వుంటున్నారు. అయితే మధ్యలో వున్నట్లుండి లోకేష్ చౌదరి మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అంతే కాదు కొన్నాళ్ళకు ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం భార్యను అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ చేసాడు. కొద్దిరోజులక్రితం భార్యను కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వమని వేరే ఊరిలో హాస్టల్ ఉంచి ఇక్కడ తన అక్రమ సంబంధం కొనసాగిచాడు.

అయితే ఇలా ఎన్నాళ్లు ఎదురుచూడాలి అని ఎలాగైనా భార్యను ఇక్కడికి రప్పించి హత్యచేయాలని భావించి ఒకరోజు మనమిద్దరం పెద్ద సమస్యలో ఇరుక్కున్నాం ఉన్నపళంగా వడోదర రమ్మని, రాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని అన్నాడు. అంతే ఉన్నఫళంగా వచ్చిన మునీష్ ను తన స్నేహితుడి సాయంతో ఘోరాతి ఘోరంగా హతమార్చాడు లోకేష్ చౌదరి. ఆమె మారుత దేహాన్ని ఆ ఇంటి ప్రక్కన వున్నా ఖాళీ స్థలంలో పూడ్చి పెట్టి హాయిగా తన జీవనం సాగించాడు. అయితే అదే మర్నాడు మునీష్ కనపడడం లేదని, అతని తండ్రి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. తనపై ఎక్కడ అనుమానం వస్తుందో అని భావించి రెండురోజులతర్వాత స్టేషన్ కి వెళ్లి, తన భార్యను ఎవరో మాయమాటలు చెప్పి బైక్ మీద ఎక్కించుకుని వెళ్లారని అబద్దం చెప్పి, పోలీస్ లపై ఆమె జాడ కనుక్కోవాలని, ఒత్తిడి చేసాడు. అయితే ఆ చుట్టుప్రక్కల సిసి కెమెరా లను పరిశీలించిన పోలీస్ లకు ఏమాత్రం క్లూ దొరకలేదు. ఆమె ఉంటున్న హాస్టల్ లో విచారించగా.

మునీష్ తో పాటు ఉంటున్న ఒక మహిళ, ఒకరోజు మునీష్ కు ఆమె భర్త ఉన్నఫళంగా ఫోన్ చేసి రమ్మన్నాడని చెప్పిందని , అందుకే వెంటనే బయల్దేరుతున్నట్లు మునీష్ చెప్పిందని ఆ యువతీ తెలిపింది. ఆ సమాచారం విన్న పోలీస్ లు ముందుగా లోకేష్ ను ప్రశ్నిచసాగారు. దానికి తోడు అతని ఫోన్ లోని కాల్ డేటా కూడా మాయం కావడంతో పోలీస్ ల అనుమానం మరింత బలపడింది. ఇక వారి స్టయిల్లో అతన్ని విచారించగా మొత్తానికి జరిగిన విషయాన్నీ బయటకి చెప్పాడు లోకేష్. వెనువెంటనే ఆ ప్రాంతంలో తవ్వి చూడగా మునీష్ శవం కనపడింది. అయితే ఆ జీవం పెద్దగా పాడు కాకపోవడంతో పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీస్ లు లోకేష్ ను అదుపులోకి తీసుకుని అతనికి సహకరించిన స్నేహితుడి జాడ కోసం వెతుకుతున్నారు…….

  •  
  •  
  •  
  •  

Comments