భార్య పై స్నేహితులతో కలిసి భర్త వికృత చర్య !

Monday, April 23rd, 2018, 04:06:13 PM IST

నేటి సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. మరీ ముఖ్యంగా కొందరు మగవాళ్ళు తమ భార్యలు కట్నం తేలేదని మరింత అమానుషంగా వ్యవహరిస్తున్నారు. మనం ఇప్పుడు చెప్పుకునే ఒక ఉదంతంలో తాళికట్టిన భర్తే ఆమెపాలిట కాల యముడయ్యాడు. ఇటీవల కరీంనగర్ జిల్లా లో జరిగిన ఈ ఘటనకు ఆ ప్రాంతవాసులు నివ్వెరపోయారు. కరీంనగర్ కు చెందిన ఒక యువకుడు, ఒక మహిళను మూడు రోజుల క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే వివాహనానికి ముందు అమ్మాయి తరపు వారు ఆమెకు నగలు పెడతాం అన్నారు. అయితే అది అమ్మాయి కాపురానికి వచేటపుడు ఇచ్చి పంపుతాం అన్నారు. రెండురోజుల తర్వాత కాపురానికి వచ్చిన ఆ మహిళా ఒట్టిచేతులతో రావడం తో, నగలు ఎవని గట్టికా ప్రశ్నించాడు భర్త.

అందుకు ఆమె పుట్టింటివారు నగలు ఇవ్వలేకపోయారు అని చెప్పగానే ఆమెను చిత్రహింసలు పెట్టిన అతడు చివరికి తన సేన్హితులు ఇద్దరినీ ఇంటికి తీసుకువచ్చి వారితో కలిసి ఆమెపై అత్యంత క్రూరంగా అత్యాచారం గావించాడు. అనంతరం మహిళా పోలిసులకు జరిగిన విషయమై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీస్ లు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా పరారీలో వున్న ఆమెభర్త, అతని స్నేహితుల కోసం గాలింపు చేపట్టారు…..

  •  
  •  
  •  
  •  

Comments