నీలి చిత్రాలు చూడాలని, వ్యభిచారం చేయాలని భార్యను ఒత్తిడి చేస్తున్న భర్త…!

Tuesday, January 24th, 2017, 10:52:58 AM IST

girl1
ఆ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన కొన్ని రోజుల తరువాతే అతను అసలు స్వరూపం బయటపడింది. నీలి చిత్రాలు చూడాలని, వ్యభిచారం చేయాలనీ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. అది భరించలేని ఆమె మోసపోయానని తెలుసుకుని తిరిగి తన తల్లితండ్రుల చెంతకు చేరింది. తల్లితండ్రులు అతని కుటుంబం గురించి ఆరా తీస్తే అతని గురించి నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. దీంతో ఆ బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

గుంటూరు అమరావతి రోడ్డులోని రామా బిల్డింగ్ ప్రాంతానికి చెందిన ఒక యువతిని పెళ్లి చేసుకుంటానంటూ కొద్ది నెలల క్రితం నెహ్రూ నగర్ ప్రాంతానికి చెందిన పెనుమచ్చు సుమన్, అతని కుటుంబ సభ్యులు వచ్చారు. సుమన్ హైదరాబాద్ లో ఏజెంట్ గ పని చేస్తున్నానని, నెలకు 25 వేలు జీతం వస్తుందని అమ్మాయి తల్లితండ్రులను నమ్మబలికారు. దీంతో అతనితో పెళ్లి చేయడానికి వారు అంగీకరించారు. నవంబర్ 20న పెళ్లి జరిపించారు. పెళ్లి తర్వాత నెల రోజులు బాగానే ఉన్న అతడు తరువాత తన విశ్వరూపం చూపించాడు. భార్యను నీలి చిత్రాలు చూడాలని, తన స్నేహితులు వచ్చినపుడు వారితో వ్యభిచారం చేయాలనీ బెదిరించేవాడు. వ్యభిచారం చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని, సుఖంగా బతకొచ్చని చెప్పేవాడు.

సుమన్ అక్క సునీత కూడా ఆమె ఇంటికి వచ్చి వ్యభిచారం చేయాలని, తాము కూడా వ్యభిచారం చేసే పైకి వచ్చామని, నీవు కూడా ఆలా పైకి రావచ్చని చెప్పింది. వ్యభిచారం చేయకపోతే నరికేస్తానని హెచ్చరించింది. ఈ విషయంపై ఆమె ఈ నెల 18న భర్తతో గొడవపడింది. దీంతో ఆమెకు కట్టిన తాళిబొట్టు తెంచుకుని, పెళ్లి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయాడు. దీంతో ఆమె 19న పుట్టింటికి వెళ్లి విషయం చెప్పగా వారు వచ్చి చూస్తే అప్పటికే ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. అక్కడి నుండే ఫోన్ చేస్తే సుమన్ తన కుటుంబ సభ్యులతో వచ్చి వారి మీద దాడి చేసాడు. తాము చెప్పినట్లు చేస్తేనే ఆమెను తీసుకువెళ్తానని, లేదంటే ఆమె అవసరం లేదన్నారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.