మరో నవ వధువు కత్తి దాడి.. పెళ్లైన 20 రోజులకే..?

Tuesday, May 29th, 2018, 10:35:24 AM IST

ఇటీవల పెళ్లైన జంటల మధ్య వివాదాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మహిళలు పెళ్లైన 10 రోజులకే భర్తలపై దాడి చేస్తున్న ఘటనలు చాలానే నమోదయ్యాయి. రీసెంట్ గా పెళ్లైన పది రోజులకే ప్రియుడితో కలిసి సరస్వతి అనే అమ్మాయి భర్తను హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటన మరవకముందే శ్రీకాకుళం జిల్లాలో మరోలా దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పెళ్లైన 20 రోజులకే ఓ నవ వధువు భర్తపై కత్తితో దాడి చేసింది.

అసలు వివరాల్లోకి వెళితే.. గొదలాం గ్రామానికి చెందిన నీలిమ (19) కు అదే ప్రాంతానికి చెందిన
23 ఏళ్ల నవీన్ కుమార్ ఆకు ఈ నెల 9న కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహమైంది. అంతా సంతోషంగానే జరుగుతుంది అనుకున్న సమయంలో ఎవరు ఊహించని విధంగా నీలిమ దారుణానికి ఒడిగట్టింది. సోమవారం ఉదయం నవీన్ నీలిమ బైక్ పై నర్సాపురానికని బయలు దేరారు. కొన్ని నిమిషాల్లోనే కుటుంబ సబ్యులకు భయంకరమైన వార్త తెలిసింది.

కత్తి గాయాలతో నవీన్ హాస్పిటల్ లో ఉన్నాడని వెళ్లారు. కోటబొమ్మాళి రైలు నిలయం దగ్గరలో కట్టుకున్న భార్య నీలిమ చాకుతో గొంతు కోసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు కనుగొన్నారు. ప్రేమ వ్యవహారమే అందుకు కారణమని నవీన్ వదిలించుకోవాలని ఈ దాడికి పాల్పడి ఉంటుందని తోటి బంధువులు చెబుతున్నారు. పోలీసులు నీలిమను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక నవీన్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వివరించారు.

  •  
  •  
  •  
  •  

Comments