జగన్ భయ్యా.. కోర్టు పిలుస్తోంది !

Sunday, September 18th, 2016, 10:43:55 PM IST

jagan
అక్రమాస్తుల కేసులో ఈనెల 23న విచారణకు హాజరు కావాల్సిందిగా హైదరాబాద్ సీబీఐ కోర్టు ప్రతిపక్ష నేత జగన్ కు సమన్లు జారీ చేసింది. జగతి పబ్లికేషన్స్ లో ‘రాంకీ’ గ్రూప్ అయోధ్య రామిరెడ్డి పెట్టిన పెట్టుబడులు మనీ లాండరింగ్ చట్టం ప్రకారం నేరమని ఈడీ పేర్కొని కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. వైఎస్ హయాంలో విశాఖలోని పరవాడలో రాంకీ పార్మాసిటీకి కేటాయించిన భూముల్లో 250 మీటర్ల గ్రీన్ బెల్ట్ ఏరియా ఉంది. తొలుత దీని 50 మీటర్లకు తగ్గించి ఆ తరువాత నెమ్మదిగా కేవలం 15 మీటర్లుగా గుర్తించారు.

దీంతో సుమారు 914 ఎకరాల భూమిని అమ్ముకుని రాంకీ గ్రూప్ రూ.133 కోట్ల లబ్దిని పొందింది. అందుకు బదులుగా జగన్ కు సంబందించిన జగతి పబ్లికేషన్స్ లో దాదాపు 2,77,777 షేర్లను రూ.350 ల చొప్పున కొని రూ.10 కోట్ల పెట్టుబడులు పెట్టారు రామిరెడ్డి. ఇలా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి లబ్ది పొందినందుకు గాను వీరిపై కేసు నమోదు చేశారు. ఇందులో ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి పై కూడా అభియోగం ఉంది. దీంతో ముగ్గురిని ఈ 2నెల 3న ప్రత్యక్షంగా విచారణకు హాజరవ్వాలని సీబీఐ కోర్ట్ ఆదేశించింది.