500 డ్రా చేస్తే 2500 ఇచ్చిన ఏటీఎం.. క్యూ కట్టిన జనం!

Friday, August 10th, 2018, 10:20:25 AM IST

సాధారణంగా ఏటీఎంలలో మోసాలు జరుగుతాయని కొంత భయంగానే డబ్బులు డ్రా చేస్తుంటారు. ప్రస్తుతం కొన్ని ఏటీఎం లలో లోపల వల్ల చినిగిన నోట్లు వస్తున్నాయి. అలాగే కొన్ని సార్లు దొంగనోట్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే రీసెంట్ గా హైదరాబాద్ లోని ఒక ఏటీఎంలో 500 కావాలని వెళితే 2500 వచ్చాయట. దీంతో చాలా మంది ఏటీఎం వద్ద క్యూ కట్టిన న్యూస్ ఒక్కసారిగా వైరల్ అయ్యింది.

వెంగళరావు నగర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎంలో గురువారం కొంత మంది ఖాతాదారులు డబ్బు డ్రా చేసుకునేందుకు పోటెత్తారు. 500 రూపాయలు తీసుకుందామని వెళితే ఒక వ్యక్తికి ఏకంగా రూ.2500 దర్శనమివ్వడంతో అతన్ని చూసి మరికొంత మంది అదే తరహాలో డ్రా చేశారు. ఆ విధంగా చాలా మంది డబ్బు తీసుకొని వెళ్ళిపోయి మరికొంతమంది ఏటీఎం వద్ద క్యూ కట్టగా మ్యాటర్ బ్యాంకు అధికారులకు తెలిసింది. వెంటనే మిషన్ ని చెక్ చేయాలనీ నిపుణులను పంపారు. ఇక అధిక డబ్బు తీసుకున్న వారి వివరాలను కనిపెట్టేందుకు బ్యాంకు సిబ్బంది సిద్ధమయ్యారు.

  •  
  •  
  •  
  •  

Comments