డబ్బులు లేవని ఏటీఎం మీద బండరాయి వేసి పోయాడు!

Saturday, June 9th, 2018, 10:29:20 AM IST

బ్యాంక్ ఎకౌంట్ లో జీతాలు పడ్డాయని తెలియగానే ఏటీఎం కు వెళదామని అనుకుంటే చేదు అనుభవం ఎదురవుతోంది, గంటల కొద్దీ క్యూలో నిలబడినా కూడా డబ్బులు చేతివరకు రావడం లేదు. ఏటీఎం లో పెట్టిన కొన్ని గంటలకే డబ్బులు అయిపోతున్నాయి. అయితే మధ్య తరగతి కుటుంబాలు ఈ ఇబ్బంది వలన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో డబ్బు లేకపోవడం ఏమిటని చాలా మంది నిలదీస్తున్నారు. ఇకపోతే మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏటీఎం లపై దాడులకు దిగుతున్నారు.

ఇటీవల హైదరాబాద్ లోని ఒక ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి వచ్చిన ఒక వ్యక్తి కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహించి ఏటీఎం స్క్రీన్ పై పెద్ద బండ రాయి వేసి పోయాడు. అసలు వివరాల్లోకి వెళితే.. చందానగర్ నల్లగండ్ల సమీపంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం ఉంది. అయితే ఒక వ్యక్తి చాలా స్పీడ్ గా వచ్చి ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసేందుకు కార్డు పెట్టి పిన్ ఎంటర్ చేశాడు. దీంతో డబ్బులు లేవని తేలింది. వెంటనే పట్టలేని కోపంతో ఆ వ్యక్తి ఏటీఎం స్క్రీన్ పైన బండ రాయి వేసి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సిసి టీవీ ఫుటేజ్ ద్వారా కేసు నమోదు చేసుకొని నిందితుడిని వెతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే అతను హెల్మెట్ వేసుకోవడం వలన పోలీసులకు అతన్ని కనుగొనడం కష్టంగా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments