హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్!

Wednesday, September 5th, 2018, 09:49:09 AM IST

ఎంతో కాలంగా నగరవాసులు ఎదురు చూసిన మెట్రో సౌకర్యం గత ఏడాది నవంబర్ లో స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కి కొత్త కళ తెచ్చిన మెట్రో జనాలకు చాలా ఉపయోగపడుతోంది. ట్రాఫిక్ తో సతమతమవుతున్న జనాలకు మెట్రో రైళ్ల ప్రయాణం మనశ్శాంతిని ఇస్తోంది. మొదట్లో అధిక చార్జీల వల్ల కొంత నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ ట్రాఫిక్ లో గంటల కొద్దీ చిరాకు తెచ్చుకోవడం కన్నా నిమిషాల్లో గమ్య స్థానాలకు చేరుకోవడం బెటర్ అని ఫిక్స్ అయిపోయారు.

ఇక రీసెంట్ గా అందిన లెక్కల ప్రకారం ఏడాది గడవకముందే మెట్రో రైలు అరుదైన రికార్డును అందుకుంది. ఏకంగా రెండు వేల కోట్ల మంది ప్రయాణికులను గమ్యం స్థానాలకు చేర్చినట్లు అధికారులు తెలిపారు. అదికూడా కేవలం 30 కిలోమీటర్ల పరిధిలోనే రికార్డు అందుకోవడం విశేషం. ఇక మరికొన్ని రోజుల్లో మిగిలిన మార్గాల్లో కూడా మెట్రో సేవలు ప్రారంభం అయితే మరింతగా ఆదరణ లభిస్తుందని మెట్రో అధికారులు చెబుతున్నారు. గత ఏడాది నవంబర్ 29న మోడీ చేతులమీదుగా మెట్రో మొదలైన సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments