అంతర్జాతీయ చానల్ లో హైదరాబాద్ మెట్రో

Tuesday, September 9th, 2014, 06:55:21 PM IST


హైదరాబాద్ మెట్రో నిర్మాణం జరిగిన తీరును గురించి నేషనల్ జియోగ్రఫీ చానల్ లో అక్టోబర్ 19న ప్రసారం కాబోతున్నది. ఈ అరుదైన గౌరవం దక్కిన తోలి మెట్రో హైదరాబాద్ మెట్రో కావడం విశేషం. ఇప్పటికే ఈ నిర్మాణం తదితర అంశాల గురించి నేషనల్ జియోగ్రఫీ చానల్ ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమో ఇప్పుడు యూట్యూబ్, సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. నేషనల్ జియోగ్రఫీ ఛానల్ లో కనెక్టింగ్ ద సిటి ఆఫ్ నిజామ్స్ పేరుతొ అక్టోబర్ 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానున్నది. మొత్తం మూడు ఎపిసోడ్స్ రూపంలో ఈ ప్రొగ్రామ్ ను నేషనల్ జియోగ్రఫీ ఛానల్ ప్రసారం చేయనున్నది. మన హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ శ్రేణి నగరంగా గుర్తింపు పొందబోతున్నది.

హైదరాబాద్ మెట్రో ప్రోమో కోసం క్లిక్ చేయండి