హైదరాబాద్ మెట్రో చార్జీలు ఎంతో తెలుసా ?.. నవంబర్ లో స్టార్ట్!

Friday, October 13th, 2017, 10:05:10 PM IST

ప్రస్తుతం తెలంగాణాలో అందరి చూపు హైదరాబాద్ మెట్రోపైనే ఉంది. ఇప్పటికే అన్ని పనులను పూర్తి చేసుకున్న మెట్రో ప్రాజెక్ట్ వచ్చే నెలలో స్టార్ట్ అవ్వనుంది. అయితే అందులో ప్రయాణించాలంటే ఏ స్థాయిలో చార్జెస్ ఉంటాయనే విషయంపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మెట్రో చార్జీలు రూ.20 నుంచి రూ.50 మధ్య ఉండేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మొదట ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసిన అప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ కేవలం రూ.8 నుంచి రూ.19 మధ్య చార్జీలు ఉంటాయని చెప్పింది. అయితే ఈ ధర ఇతర నగరాలకంటే తక్కువనే చెప్పాలి. సక్సెస్ కొనసాగుతున్న ఢిల్లీ నగరంలో గరిష్ట మెట్రో టికెట్ ధర 60 రూపాయలు. బెంగుళూరులో కూడా అదే స్థాయిలో ఉంది.

ఇక ముంబై మెట్రో టికెట్ గరిష్ట చార్జి ధర అయితే దేశంలోనే ఎక్కువగా రూ.110. చెన్నైలో మాత్రం 70 రూపాయలు. వీటన్నటికి కంటే తక్కువ ధరకే తెలంగాణ సర్కారు అందుబాటులో ఉండే ధరను నిర్ణయించింది. ప్రాజెక్టును చేపట్టిన ఎల్ అండ్ టీ-హెచ్ఎంఆర్ఎల్‌లకు నగరంలోని ముఖ్యమైన ప్రదేశాల్లో షాపింగ్ మాల్స్ మరియు ఇతర బిజినెస్ కోసం కొన్ని స్థలాలను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే వచ్చే చార్జీలతో ఎల్ అండ్ టీ ఆదాయాన్ని పొందలేదు. అయితే 269 ఎకరాలు కేటాయించి నష్టాల నుంచి బయటపడేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక మెట్రో రైలు ద్వారా నాగోల్ నుంచి మియాపూర్ వరకు దాదాపు 30 కిలో మీటర్ల వరకు ఏ ఇబ్బందిలేకుండా ప్రయాణించవచ్చు. నవంబర్ 28న మోడీగారి చేత మెట్రో రైలు ప్రారంభం కానుంది. ఈ వేడుకకు మోడీ గారు తప్పకుండా హాజరు కావాలని ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు గారు లేఖ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. నవంబర్ 28-30 తేదీ లలో హైదరాబాద్‌లో జరిగే గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ సదస్సు కు వస్తున్నారు కాబట్టి అలాగే మెట్రోను కూడా స్టార్ట్ చెయ్యాలని ఆ లేఖలో తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments