షాక్‌ : మ‌ంత్రి కేటీఆర్‌పై సిటిజ‌న్ వీరంగం

Thursday, September 13th, 2018, 09:17:41 PM IST

హైదరాబాద్ గురించి మాట్లాడే ముందు రోడ్ల ధైన్యస్థితి గురించి మాట్లాడాలి. ఇక్క‌డ‌ రోడ్లు ఎంత దారుణంగా ఉంటాయో మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ట్రాఫిక్‌లో గంట‌ల కొద్దీ ప్ర‌యాణించేవారికి న‌ర‌కం త‌ప్ప‌దు. ఫ్లైఓవ‌ర్లు, క‌ల్వ‌ర్టుల పేరుతో స‌గం రోడ్లు నిరంత‌రం త‌వ్వేసి ఉంటాయి. నిత్యం వేలాది వాహ‌నాలు ప్ర‌యాణించే రోడ్లే అతీగ‌తీ లేకుండా అత్యంత ద‌య‌నీయ స్థితిలో ఉంటాయి. ఎండాకాలంలోనే ఈరోడ్ల‌పై ప్ర‌యాణాలు క‌ష్టం. అలాంటిది వ‌ర్షాకాలం అయితే అత్యంత దారుణంగా ఉంటుంది. బ‌య‌టికి వెళ్లిన వాళ్లు తిరిగి ఇంటికి వ‌చ్చే వార‌కూ గ్యారెంటీ ఇవ్వ‌లేం. గుంత‌ల రోడ్‌లో ఎక్క‌డ ఎలాంటి ముప్పు పొంచి ఉందో, ఏ సందులో ఏ నాళా తెరుచుకుని ఉందో అన్న భ‌యంతోనే ప్ర‌యాణించాలి. న‌గ‌రం అభివృద్ధి పేరుతో త‌వ్వ‌కాల్లోనే ఏళ్ల‌కు ఏళ్లు గ‌డిచిపోతోందంటే అతిశ‌యోక్తి కానేకాదు. వీటికి తోడు కిలోమీట‌ర్ల పొడ‌వునా యూట‌ర్నులు తిరిగేవారికి ఇంత‌కంటే న‌ర‌కం వేరొక‌టి అక్క‌ర్లేద‌న్న క‌ల‌త నిరంత‌రం త‌ప్ప‌నిస‌రి. ఇటీవ‌ల ఓ స‌ర్వేలో తేలిన ఘోరాతిఘోర నిజం ఏమంటే న‌గ‌రంలో ఎంత గొప్ప ఉపాధి ఉన్నా ఈ న‌రకం అనుభ‌వించ‌లేక ఆల్ట‌ర్నేట్ ఏం ఉందా? అని సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్లు వెతుకుతున్నార‌ట‌. ఇక్క‌డ ఈ న‌ర‌కం అనుభ‌వించే కంటే.. వేరే న‌గ‌రాల్లో ఉద్యోగాల కోసం వెతుకుతున్నార‌న్న స‌మాచారం ఉంది.

అదంతా స‌రే.. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయితే ప్ర‌భుత్వంపైనా, మంత్రి కేటీఆర్‌పైనా కోపం ప‌ట్టలేక త‌న ఆవేశాన్ని ట్విట్ట‌ర్ సాక్షిగా వెల్ల‌గ‌క్కాడు. ఇటీవ‌ల‌ స‌మ‌స్య‌ల్ని నేరుగా కేటీఆర్ ట్విట్ట‌ర్‌కే పోస్ట్ చేస్తున్న జ‌నంలోంచి తీవ్ర ఆవేద‌న త‌న్నుకొస్తోంది. ఓవైపు రోడ్ల నిర్మాణానికి, అభివృద్ధికి ఎంత కృషి చేస్తున్నా.. నెల‌రోజులు తిర‌క్కుండానే వ‌ర్షార్ప‌ణం అయిపోయేంత దారుణ‌మైన అవినీతి ఈ రోడ్ల‌లో ఉంద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. కార‌ణం ఏదైనా.. హైద‌రాబాద్ రోడ్ల డొల్ల‌త‌నాన్ని తెలియ‌జేస్తూ .. మణికొండకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి శివ ట్విట్టర్ సాక్షిగా కేటీఆర్ పై విరుచుకుపడ్డాడు. నేను సకాలంలో టాక్స్ కడుతున్నాను. మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చచ్చాక స్పందిస్తారా..? అని రుస‌రుస‌లాడేశాడు. అది ప్ర‌శ్న కాదు.. శ‌రం అంటే త‌ప్పే కాదు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. లైవ్‌లో న‌ర‌కం అనుభ‌వించేవాడికే క‌దా అస‌లు క‌ష్టం ఏంటో తెలిసేది. వినండి సారూ మంత్రి గారూ..!

  •  
  •  
  •  
  •  

Comments