సూర్యుడు మంచి వేడిమీద ఉన్నాడు.. కొంచెం జాగ్రత్త!

Friday, March 30th, 2018, 10:32:51 AM IST

ఫిబ్రవరి అలా వెళ్లిందో లేదో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలు పెట్టాడు. మార్చ్ మొదటి నుంచి ఉష్ణోగ్రత తీవ్రత చాలా పెరిగిపోతోంది. రానున్న రోజుల్లో కూడా ఎండ తీవ్రత చాలా పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. ఈ సమ్మర్ సీజన్ లో గురువారం భాగ్యనగరంలో గరిష్టంగా 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి పొడిగాలులు ఎక్కువగా వీస్తున్నాయి. ఆకాశంలో మేఘాల జాడ కూడా కనిపించడం లేదు. తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల, రామగుండంలతో పాటు ఏపీలోని రెంటచింతల, ఒంగోలు వంటి ప్రాంతాల్లో 40 డిగ్రీలను తాకడం జనాలను కలవరపెడుతోంది. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రాకూడదని సమ్మర్ లో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఇక ఏప్రిల్ 2వ తేదీ తరువాత ఇరు రాష్ట్రాల్లో కొంచెం చల్లదనం ఏర్పడవచ్చని మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనావేస్తోంది.