విచిత్ర నాటకం ఆడి బకరా అయిన అత్త..!

Thursday, February 23rd, 2017, 10:43:26 AM IST


తన కోడలు తనకు గౌరవం ఇవ్వడం లేదని ఆమె అత్త విచిత్ర నాటకం ఆడింది. చివరకు ఆ నాటకంలో ఆమే బకరాగా మిగిలింది. సీరియల్ సీన్ ని తలపించే ఈ రియల్ సీన్ హైదరాబాద్ లోని చందానగర్ ఠాణా పరిధిలో జరిగింది. తనని గౌరవించని కోడల్ని ఎలాగైనా ఇబ్బందులకు గురిచేయాలనుకుంది. చందానగర్ కు చెందిన దశరథ్ రిటైర్డ్ ఉద్యోగి. ద్రౌపతి అతని భార్య . వీరిద్దరూ వారి కొడుకు దుర్గా నాగరాజు, కోడలు శ్వేతా , మనవడితోనే కలసి ఉంటున్నారు . ద్రౌపతి తన కోడలిని శ్వేతని ఎలాగైనా ఇబ్బందులకు గురిచేయాలనుకుంది. ఓ రోజు దుర్గానగరాజుకి ఒంట్లో బాగాలేకపోతే అతను శ్వేతలో కలసి ఆసుపత్రికి వెళ్ళాడు. దశరథ్ అదే సమయంలో ఈ సేవ కేంద్రానికి వెళ్లాడు.ఆ సమయంలో ఇంట్లోకి ఇద్దరు దొంగలు పడ్డారని, తనని బెదిరించి బీరువా తెరచి తనకోడలి నగలు దొంగిలించి వెళ్లారని ద్రౌపతి తన భర్త దశరథ్ తిరిగొచ్చాక చెప్పింది.

దీనితో వీరిద్దరూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీస్ లు వారి ఇంటి పరిధిలో ఉండే సిసిటివి ఫుటేజ్ ని పరిశీలించారు. కానీ ఆ సమంయంలో వారి ఇంట్లోకి దొంగలు ప్రవేశించినట్లు అందులో రికార్డ్ కాలేదు. ద్రౌపతి చెవి పోగులు మాత్రం అలాగే ఉన్నాయి. బీరువా లోని నగలను దొంగిలించిన దొంగలు ద్రౌపతి చెవిపోగులు బెదిరించి ఎందుకు తీసుకెళ్లలేదన్న అనుమానం పోలీస్ లకు వచ్చింది. ఇంట్లోనే ఏదో జరిగిందని భావించిన పోలీస్ లు ద్రౌపతిని విచారించారు. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం మరింతపెరిగింది. ఆమె భర్త దశరథ్ గట్టిగా మందలించడంతో కోడలిపై ఉన్న కోపంతో తానే ఆ నగలను దాచిపెట్టినట్లు ద్రౌపతి ఒప్పుకుంది. ఆమె సమాధానం విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు.