హైదరాబాద్ లోని ప్రముఖ మల్టి బ్రాండెడ్ స్టోర్ భోజనంలో బల్లి!

Sunday, September 2nd, 2018, 04:02:59 PM IST

దేశవిదేశాల్లో ఎంతో పెరిన్నికగని, వివిధ రకాల ఉత్పత్తులను అందిస్తున్న విదేశీ దిగ్గజం ఐకియా, ఇటీవల మన దేశంలో ప్రప్రధమంగా అదికూడా హైదరాబాద్ నగరంలో ప్రారంభించబడడం నిజంగా మన అదృష్టమే అనుకున్నారు అంతా. అంతేకాదు, స్టోర్ ప్రారంభమైన తొలిరోజు కొన్నివేలమంది కస్టమర్లు స్టోర్ ని చూడడానికి తండోపతండాలుగా తరలివెళ్లారు. అయితే మొదటిరోజునుండి ఒకింత బాగానే అమ్మకాలు జరుపుకుంటున్న ఐకియా స్టోర్, నిన్న జరిగిన ఒక ఘటనతో కొంత ప్రభావాన్ని కోల్పోయిందని చెప్పుకోవాలి. స్టోర్ కి వచ్చే వారికీ రెఫ్రెషమెంట్ కోసం అక్కడ రకరకాల ఆహారపదార్ధాలను కూడా విక్రయిస్తోంది ఐకియా.

అయితే ఎప్పటిలానే నిన్న స్టోర్ కి వెళ్ళినపుడు అక్కడ భోజనం చేసిన కొందరికి భోజనంలో బల్లి దర్శనమివ్వడంతో, అక్కడి కస్టమర్లంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. జరిగిన విషయంపై స్టోర్ మేనేజర్ మరియు ఇతర నిర్వాహకులకు ఫిర్యాదు చేసారు. అయితే భోజనంలో బల్లిరావడంపై ఆగ్రహించిన కొందరు కస్టమర్లు విషయాన్నీ ఫుడ్ ఇన్స్పెక్టర్ కు నివేదించగా. సమాచారం అందుకున్న జిహెచ్ఎంసి ఫుడ్ కంట్రోలర్ సుదర్శన్ రెడ్డి, అక్కడి ఆహారాన్ని, పరీక్ష నిమిత్తం ల్యాబ్ కు పంపారు. అయితే ల్యాబ్ రిపోర్టు ప్రకారం చూస్తే, నిజంగానే భోజనంలో బల్లిపడడం వాస్తవమేనని రుజువుకావడంతో ఐకియా సంస్థ ప్రతినిధులకు రూ.11,500 జరిమానా విధించి, మరొక్కసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదు అంటూ హెచ్చరించారు…….

  •  
  •  
  •  
  •  

Comments