కేసీఆర్ నుండి షాకింగ్ కామెంట్స్… ఏం ప‌ర్లేదు స్వీక‌రిస్తానంటున్న‌- చంద్ర‌బాబు… మెయిన్ రీజ‌న్ అదేనా..?

Tuesday, October 9th, 2018, 11:26:55 AM IST

తెలుగు రాష్ట్ర‌మైన తెలంగాణ‌లో ఎన్నిక‌ల న‌గార మోగిన‌విష‌యం తెలిసిందే. దీంతో అధికార, ప్ర‌తిప‌క్షాలు త‌మ‌దైన శైలిలో ఒక‌రి పై ఒక‌రు విమ‌ర్శ‌లు గుప్పించుకుంటూ త‌మ నోటికి ప‌ని చెబ‌తున్నారు. అయితే తాజాగా తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి పై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.

అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఇటీవ‌ల చంద్ర‌బాబు మాట్లాడుతూ.. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదితో కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాడ‌ని చంద్ర‌బాబు మాట్లాడుతున్నాడ‌ని.. కేసీఆర్, జ‌గ‌న్, ప‌వ‌న్‌ల‌ను క‌లుపుకొని కేంద్రం త‌న‌ను వేధిస్తోంద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. దీంతో చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల పై కేసీఆర్ తాజాగా వనపర్తిలో జరిగిన టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఘాటుగా స్పందించారు.

చంద్ర‌బాబును వేధించ‌డానికి న‌రేంద్ర‌మోదీతో త‌న‌కు క‌ల‌వాల్సిన అవ‌స‌రం త‌న‌కు లేద‌ని.. చంద్ర‌బాబు స‌క్క‌గా ఉంటే.. త‌న జోలికి ఎవ‌రు వ‌స్తార‌ని.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయావు.. నీ వాయిస్ రికార్డు అయ్యింది.. దెబ్బ‌తో పారిపోయావు.. నీతో మేము దోస్తీ చేయాలా.. ఛీఛీ బ‌తికుండ‌గా చంద్ర‌బాబుతో దోస్తీ చేయం అని తేల్చేశారు.

అంత‌టితో ఆగ‌కుండా.. అయ్యా చంద్ర‌బాబు నీ అడుగు ప‌డితేనే ప‌చ్చ‌టి చెట్టుకూడా భ‌స్మం అయిపోతుంది.. నీ ఐర‌న్ లెగ్ మ‌హిమ అంత ద‌రిద్రం… నీలాంటి వారితో మేము పొత్తులు పెట్టుకోము.. మేము క‌లిసిరాక‌పోయే స‌రికి మ‌హాకూట‌మి ఏర్ప‌డింద‌న్నావుగా.. మీ ద‌మ్మేంటో.. మా ద‌మ్మేంటో.. తెలంగాణ ప్ర‌జ‌ల ద‌మ్మేంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో లేలుతుంది అంటూ కేసీఆర్ త‌న‌దైన మాట‌ల‌తో ఫైర్ అయ్యారు.

అయితే ఇక్క‌డ అసలు మ్యాట‌ర్ ఏంటంటే.. త‌న పై కేసీఆర్ చేసిన తిట్ల దండ‌కాన్ని.. ఇప్ప‌డు చంద్ర‌బాబు త‌న‌దైన చాణ‌క్యంతో త‌న‌కు పాజిటీవ్‌గా మార్చుకుంటున్నారే వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. మామూలుగానే తెలంగాణ‌లో చంద్ర‌బాబు గ్రాఫ్ అంతంత మాత్ర‌మే. అయితే తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల వ‌ల్ల చంద్ర‌బాబు గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింద‌ని.. అమ‌రావ‌తి రాజ‌కీయ వ‌ర్గాల్లో ఓ హాట్ టాపిక్ న‌డుస్తోంది.

దీంతో కేసీఆర్ మైక్ ప‌ట్టుకున్న‌ప్పుడ‌ల్లా చంద్ర‌బాబును బాగా తిట్టే విధంగా గులాబీ బాస్‌ను రెచ్చ‌గొట్ట‌మ‌ని తెలుగుత‌మ్ముళ్ళ‌ను పుర‌మాయించార‌ట‌. మ‌రో కేసీఆర్ త‌న‌ని తిట్టినా ఆయ‌న ఫొటోలు త‌గ‌ల బెట్టొద్ద‌ని టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు చెబుతున్నార‌ట‌. దీంతో త‌న‌ను కేసీఆర్-తిడుతుంటే ఈ పసుపు అధినేత పై సానుభూతి పెరిగి ఆయ‌న గ్రాఫ్ పెరుతోంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నార‌ని తెలుస్తోంది. దీంతో రానున్న రోజుల్లో కేసీఆర్ నోటి నుండి చంద్ర‌బాబు పై ఎలాంటి తూటాలు జాలువారుతాయో.. వాటిని చంద్ర‌బాబు ఏవిధంగా పాజిటీవ్‌గా మార్చుకుంటారో ముందు ముందు చూడాల‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.