నేను నాన్న పోలిక కాదు.. తాత పోలిక‌! -లోకేష్‌

Friday, November 18th, 2016, 02:30:45 AM IST

nara-lokesh1
న‌వ‌ర‌స న‌ట‌సార్వ‌భౌముడు.. అన్న‌గారు ఎన్టీఆర్‌తో వేరొక‌రికి పోలిక ఏంటి? ఎవ‌రైనా పోల్చుకున్నా ఆయ‌నేంటి? ఈయ‌నేంటి? అంటూ పెద‌వి విరిచేయ‌రూ.? కానీ ఆ సాహ‌సం చేశారు ఒక‌రు. అవును నేను తాత పోలిక‌.. అనేశారు. అస‌లింత‌కీ ఎవ‌రీయ‌న‌..? అంటే ఆయ‌నేం ప‌రాయివాడు కాదు. స్వ‌యానా స‌ద‌రు తాత‌గారికి ముద్దుల మ‌న‌వ‌డు. ఇంకెవ‌రండీ..? ఇదంతా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కొడుకు లోకేష్ నాయుడు గురించే. లోకేష్ ఇటీవ‌లే ఓ సంద‌ర్భంలో తన తండ్రి చంద్రబాబు గురించి మాట్లాడుతూ-“నాన్న‌గారు చాలా ఆరోగ్య వంతుడు. మ‌రో ఇరవై ఏళ్లు ఆయనే ఏపీకి సీఎంగా ఉంటారు“ అంటూ జోస్యం చెప్పారు. మెడిటేషన్ వ‌ల్ల‌నే ఇది సాధ్యమైంద‌ని చెప్పారు.

ఇక నాకు మాత్రం తాత పోలిక వచ్చింది. నేను తిండిని క‌ట్టేయ‌లేక‌పోతున్నా .. అందుకే కాస్త బొద్దుగా ఉన్నాన‌ని చిన‌బాబు లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మ‌రి భ‌విష్య‌త్ సీఎంగా పిలిపించుకుంటున్న లోకేష్ తాత అంత పేరు తెచ్చుకునే సీఎం అవుతాడా? లేక తండ్రి అంత హైటెక్ సీఎం అవుతాడా? చూడాలి మ‌రి!!