నేను మరీ అంతలా దిగజారలేదు- పవన్ కళ్యాణ్ సంచలన వాఖ్యలు…

Saturday, January 12th, 2019, 02:00:30 PM IST

పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాల నాయకులూ మరియు కార్యకర్తలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశనికి హాజరైన పవన్ కళ్యాణ్, అక్కడ మాట్లాడుతూనే కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. నేను రాజకీయాల్లోకి వచ్చాక ఇక్కడ చాలా నేర్చుకున్నానని, నన్ను ఎవ్వరు ఎంతలా విమర్శించినా కూడా నేను మాత్రం దిగజారుడు వాఖ్యలు చేయనని పవన్ కళ్యాణ్ అన్నారు. నేను చెడుబుకున్నది ఇంటర్ వరకే కానీ, ఇప్పాయికి కూడా రోజుకు కొన్ని గంటలు చదువుతూనే ఉంటానని పవన్ కళ్యాణ్ అన్నారు. అక్కడ సమావేశానికి హాజరైన నేతలకు పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేశారు.

అంతేకాకుండా, ప్రస్తుత రాజకీయాలతో విసిగిపోయి ఉన్న ప్రజలకు, మనం ఇక్కడ చక్కని మార్పు తీసుకురావాలని, అన్ని విధాలుగా ప్రజలను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజా సంక్షేమంకోసం ఎవరితోనైనా ఢీకొనేందుకు రెడీగా ఉన్నానని పవన్ తెలిపారు. గతంలో నన్ను విమర్శించినా వారే , నేడు పొత్తులకు నన్ను ఆహ్వానిస్తున్నారని పవన్ అన్నారు. అంతలా మనం ప్రజల్లోకి వెళ్లిపోయామని, అందుకనే ఇప్పటికి కూడా కొందరు మనల్ని విమర్శిస్తున్నారని పవన్ ఆరోపించారు. ఇంకా పార్టీని బలోపేతం చేయాలనీ పవన్ అందరికి సూచించారు.