నేను తలచుకుంటే ఇప్పుడే సీఎంని అవుతా : సీనియర్ నటి

Friday, July 27th, 2018, 12:05:51 AM IST


ఈ మాట వింటుంటే అందరికి అది ఎలా సాధ్యం అబ్బా అని ఆశ్చర్యం కలుగక మానదు. అయితే ఈ మాట అన్నది మరి ఎవరో కాదు, బాలీవుడ్ సీనియర్ నటి మరియు ప్రస్తుతం రాజకీయాల్లో ఎంపీగా కొనసాగుతున్న డ్రీం గర్ల్ గా పేరు గాంచిన హేమమాలిని. తాను తలచుకుంటే ఇప్పటికిప్పుడే సీఎం కాగలనని, అయితే ఆ పదవిపై తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని, ఒకవేళ సీఎం అయితే కొన్ని రకాల ఇష్టాలను, మరియు స్వేచ్ఛ లను కోల్పోయి కొన్నిటికి మాత్రమే పరిమితం కావలసి వస్తుందని ఆమె అంటున్నారు. గత ఎన్నికల సమయంలో తాను బ్రిజ్వాసి ప్రాంతం తరపున నిలబడి గెలవడం నిజంగా తన అదృష్ట్రమని, ఇక్కడి ప్రజలకు సేవ చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని ఆమె అంటున్నారు.

వాస్తవానికి తనకు ప్రజల్లో వున్న ఆదరణ రీత్యా తాను ఎంపీగా కాగలిగానని ఆమె చెప్తున్నారు. అంతే కాదు అసలు తాను రాజకీయాల్లోకి రాకముందే తనవంతు వీలయిన సేవ కార్యక్రమాలను నిర్వహించానని, ఎంపీగా గెలిచి గడచినా ఈ నాలుగేళ్లలో తన నియోజకవర్గంలో ఇచ్చిన హామీల మేరకు దాదాపుగా అన్ని పనులు కూడా నెరవేర్చడం జరిగిందని అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మహిళలు, వృద్ధులు, నిరుద్యోగుల కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల దేశంలో బీజేపీ ఖ్యాతి మరింత పెరిగిందని, రాబోయే ఎన్నికల్లో కూడా తమ పార్టీ జాతీయ స్థాయిలో తప్పక విజయం సాదిస్తుందని ఆమె అంటున్నారు…

  •  
  •  
  •  
  •  

Comments